వర్గల్ రాతిచిత్రాలలో వరగల్లు పేరు
x

వర్గల్ రాతిచిత్రాలలో వరగల్లు పేరు

వర్గల్ ఆలయంలోని కుడ్య చిత్రాల మీద ఈ అక్షరాలున్నాయి.


ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రం వర్గల్ చారిత్రంగా కూడా ప్రసిద్ధమే. ఇక్కడ చరిత్రపూర్వయుగ సంస్కృతులను తెలిపే రాతిచిత్రాల తావులు మూడుచోట్ల ఉన్నాయి. మెగాలిథిక్ సమాధుల జాడలున్నాయి. రాష్ట్రకూటులనాటి శాసనముంది. సరస్వతిదేవతను కొండెక్కించి గుడికట్టిన చరిత్ర కొత్తదే.




గుట్ట కింద పాతగుడుల ఆనవాళ్ళున్నాయి. పైన సరస్వతి ఆలయానికి ఎడమపక్కన స్టోర్ గా వాడుతున్న రాతిగుహ కప్పుకు కిందివైపున ఎన్నో రాతిచిత్రాలున్నాయి.



మానవచర్యలవల్ల అవి నానాటికి అదృశ్యమైపోతున్నాయి. ఆ రాతిచిత్రాలలో మధ్యరాతియుగంనాటి కొంగ, సామూహిక మానవనృత్యాల పెయింటింగ్స్ ఉన్నాయి.




ఆ రాతిచిత్రాలలోనే మధ్యయుగాల( 8, 9వ శతాబ్దాల)నాటి తెలుగన్నడలిపిలో లఘుశాసనాలు వలయాకారంలో, విడి, విడిగా రాయబడివున్నాయి.








వాటిలో ‘వరగన్టి’, స్వస్తిశ్రీ ...మల్ల, కల్గిని’ అని పేర్కొనబడ్డ శాసనభాగాలను గుర్తించామని కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ తెలిపారు.


Read More
Next Story