వరంగల్ విద్యార్థికి  కృత్రిమ కాళ్లు
x
కృత్రిమ కాళ్లతో నడుస్తున్న రాహుల్

వరంగల్ విద్యార్థికి కృత్రిమ కాళ్లు

రెండు కాళ్లు కోల్పోయిన వరంగల్ జిల్లా విద్యార్థికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.


రైలులో ప్రయాణిస్తున్నపుడు జరిగిన దాడిలో కిందపడి రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ అనే వరంగల్ జిల్లా విద్యార్థికి హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు కృత్రిమ కాళ్లు అమర్చి పునర్జన్మ ప్రసాదించారు.


రెండు కాళ్లు కోల్పోయి...
వరంగల్ జిల్లా గీసుకొండ గ్రామానికి చెందిన రాహుల్ అనే ప్రతిభావంతుడైన విద్యార్థి రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో ఐఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.రాహుల్ వరంగల్ నుంచి కోటా నగరానికి రైలులో ప్రయాణిస్తుండగా గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడి చేసి రైలు నుంచి రైలు కిందకు నెట్టివేశారు. దీంతో అతని రెండు కాళ్లు పోయాయి.

సీఎం సహాయం
రెండు కాళ్లు కోల్పోయి భవిష్యత్ అంధకారంగా మారడంతో రాహుల్ తో అతని తల్లిదండ్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ కు నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక కృత్రిమ అవయవాలను అమర్చేందుకు రూ.10 లక్షలు మంజూరు చేశారు.



కృత్రిమ కాళ్లతో మళ్లీ నడుస్తూ....

రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు నిమ్స్ వైద్యులు కృత్రిమ కాళ్లు అమర్చడంతో ఆయన మళ్లీ నడవగలుగుతున్నాడు. రెండు కాళ్లు కోల్పోయిన తనకు కృత్రిమ కాళ్లు ఏర్పాటు చేయడంతో తన కల సజీవంగా ఉందని, తాను ఐఐటీ సాధించాలనే తన ఆకాంక్షను నెరవేర్చుకుంటానని రాహుల్ చెప్పారు. తమ కుమారుడికి కృత్రిమ కాళ్లు అమర్చిన వైద్యులు, సహాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థి కన్న కలలన్నీ కల్లలుగా మారవని, ప్రభుత్వం తోడుంటే కలలు కొత్తగా మొదలవుతాయనడానికి రాహుల్ జీవనయానమే సాక్ష్యంగా నిలిచింది.




Read More
Next Story