Revanth Reddy
x
సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | ‘అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను తిరస్కరిస్తున్నాం’

స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.


దేశంలో పలు ప్రాజెక్ట్‌లు సొంతం చేసుకోవడం కోసం అధికారులకు వ్యాపారవేత్త అదానీ(Adani) భారీ మొత్తంలో లంచాలు ఇచ్చారన్న అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. ఈ విషయం తెలంగాణలో కూడా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) డ్రీమ్ ప్రాజెక్ట్‌ స్కిల్ యూనివర్సిటీ(Skill University) నిర్మాణం కోసం అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల వివరాలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు విరాళమా? లంచమా? లంచంలో కొంత భాగమేనా? అని కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు. తాజాగా వీటిపై రేవంత్ రెడ్డిస్పందించారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు మీడియా సమక్షంలో ప్రకటించారు.

‘‘అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. అదే విధంగా అదానీ నుంచి కూడా చట్టబద్దంగానే పెట్టుబడులను అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది. అదానీ, టాటా, అంబానీ.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. సీఎస్ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ఇచ్చింది. దీనిని ప్రాజెక్ట్‌ల కోసం సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని వారిని హెచ్చరిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More
Next Story