కొత్త రేషన్ కార్డులకు వేళాయే.. ప్రకటించిన మంత్రి పొన్నం
కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో వేల మంది ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల మంజూరు జరగలేదు.
కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో వేల మంది ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల మంజూరు జరగలేదు. దీంతో ఈ పదేళ్ల కాలంలో కొత్తగా పెళ్ళిళ్లు అయిన వారు, కుటుంబాలు వేరు పడిన వారు రేషన్ కార్డుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుందని తెలిపారు. 2025 సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదిక వెల్లడించారు. ఏవైరా రేషన్ కార్డులు కావాలంటే మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. తాజాగా ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులకు తమ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోందని, అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభమవుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని ఆయన తెలిపారు. అర్హులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, కొత్త రేషన్ కార్డులను వీలైనంత త్వరగా మంజూరు చేయడం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారాయన. ఈ సందర్భంగా తెలంగాణలో సర్పంచ్, ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడారు.
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాటి కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పనిచేయాలేని, ప్రభుత్వం చేస్తున్న పనులను, అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం రూ.30వేల కోట్లు కేటాయించని గుర్తు చేశారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఈ అంశంపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చయించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అందరూ మరింత మెరుగ్గా పని చేయాలని సూచించారు.
సీఎం ఏమన్నారంటే..
‘‘స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి.... అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే సమాచారం నా దగ్గర ఉంది. మార్పు కోసం మనకు ప్రజలు అధికారం ఇచ్చారు. మాట నిలబెట్టుకుందాం..కష్టపడి పనిచేద్దాం. మరింత పట్టుదలగా పనిచేయండి. ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు గుర్తించారు. ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారు. సమస్యలను అధిగమించేందుకు బీఆర్ఎస్ దుష్పచారాన్ని తిప్పికొట్టండి. మరింత చిత్తశుద్ధి పనిచేద్దాం. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయండి. ప్రతిఒక్కరు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలి’’ అని సీఎం తెలిపారు. తనతో సహా ప్రతి నేత ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందని కూడా రేవంత్ వెల్లడించారు.