
రాహుల్ ప్రధాని కావడం దేశానికే అవసరమా..?
ప్రతి కార్యకర్తకు ఏదో ఒక పదవి తప్పకుండా వస్తుందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అంతా కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ కావడం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, ఏ కార్యకర్తను కాంగ్రెస్ వదులుకోదని, వారికి అన్యాయం జరగనివ్వదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలను ఉద్దేశించి భట్టి విస్తృతస్థాయి సమావేవం నిర్వహించారు. అందులో అంతా కలిసికట్టుగా పనిచేసి రాహుల్‌ను ప్రధానిని చేయాలని అన్నారు.
‘‘ప్రతి కార్యకర్తకు పార్టీలో లేదా ప్రభుత్వంలో ఏదో ఒక పదవి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ అజేయంగా ఉండానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టే ప్రతి పనికి సీఎం రేవంత్ సహా కేబినెట్ అంతా అండగా నిలుస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించడానికి, సవాళ్లను దుర్కొని న్యాయం చేయడానికి ముందుకు వెళ్తున్నాం. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని బీఆర్ఎస్ తీసుకొచ్చింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును బీజేపీ.. రాష్ట్రపతి దగ్గర ఆపింది. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి’’ అని ఆయన ఆరోపించారు.