Deputy CM Bhatti Vikramarka
x

‘బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తాం’

సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.


బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం ఎన్ని పోరాటాలు చేయడానికయినా సిద్ధమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడం శుభపరిణామమని ఆయన చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని పోరాటాలు చేసయినా రిజర్వేషన్లు సాధిస్తామని, ఇప్పటికే మూడు చట్టాలు, ఒక జీవో, ఒక ఆర్డినెన్స్ తెచ్చామని గుర్తు చేశారు. ఢిల్లీలో కూడా ధర్నా చేశామని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరితే ఇవ్వలేదని గుర్తు చేరశారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించామని చెప్పారు.

హైకోర్టులో తేల్చుకోండి..

బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే పిటిషన్‌దారుపై ప్రశ్నలు గుప్పించింది. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున... విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది ధర్మాసనం. హైకోర్టులో స్టే ఇవ్వలేదని.. అందుకే ఇక్కడకు వచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దాంతో హైకోర్టులో స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వచ్చేస్తారా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అంనతంర జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

హైకోర్టులో స్టే ఇవ్వలేదు కాబట్టి.. ఇక్కడి వచ్చారా అని ప్రశ్నించింది. అసలు ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టుకే వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే విషయాన్ని స్పష్టం చేసి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Read More
Next Story