‘కృష్ణాజలాల్లో తెలంగాణకు 71శాతం’
x

‘కృష్ణాజలాల్లో తెలంగాణకు 71శాతం’

తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధిస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


కృష్ణా జిలాల విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధించి తీరుతామన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా నది నీటి విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు రవాల్సిన నీటిని కూడా ఆంధ్ర దోచుకుంటుందని తెలంగా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై చర్చించడానికి కృష్ణా బోర్డు అనేక సార్లు రెండు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వహించినా లాభం లేకుండా పోయింది. కాగా ప్రతి సారి కూడా తెలంగాణ నేతలు చేసిన డిమాండ్‌లకు బోర్డుకానీ, ఏపీ నేతలు కానీ ఒప్పుకోలేదు. ఆఖరికి కేంద్రం జోక్యం కోరినా సరే ఈ సమస్య పరిష్కారం కాలేదు. అయితే కృష్ణా నది జలాల విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేసేది లేదని, ఎంత దూరమైనా వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తెచ్చుకుంటామని తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

71శాతం డిమాండ్ చేస్తాం..

కృష్ణా జలాల అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివాసంర సమావేశమయ్యారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న వాటా వివాదంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగానే కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 71శాతం డిమాండ్ చేస్తాం. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తాం. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేది లేదు. ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తాం. తాగు, సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటాం. ట్రిబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్.. ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారు’’ అన ఆయన వెల్లడించారు.

Read More
Next Story