Revanth Reddy | ‘నెవ్వర్ బిఫోర్ అనేలా హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం’
x

Revanth Reddy | ‘నెవ్వర్ బిఫోర్ అనేలా హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం’

హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


హైదరాబాద్‌(Hyderabad)ను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగానే కృషి చేస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరబాద్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు. నగరంలో ప్రతి ఒక్కరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అందుకోసం రూ.7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఎస్‌టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

రూ.1.5 లక్షల కోట్లే ఖర్చు

‘‘ఏడాది క్రితం రాష్ట్ర ప్రజలంతా మార్పు కోసం ఓటేశారు. వారి ఏదైతే కోరుకుని ఓటేశారో అది అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అమలు చేయడం ప్రారంభించాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచాం. మెట్రోను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వానికే మణిహారం. రూ.35 వేల కోట్లతో 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను రూపొందించనున్నాం. ఓఆర్ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. దీని కోసం 40 నుంచి 50 వేల ఎకరాల భూమిని కేటాయిస్తాం. టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.

దేశానికే హైదరాబాద్ తలమానికం: భట్టి

హైదరాబాద్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక విషయాలు పంచుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, హైదరాబాద్ నగరం భారతదేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచంలోనే హైదరాబాద్ ను గొప్ప నగరం గా మార్చేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, మంచినీటి పథకాలు, అనేక పరిశ్రమలను అన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవే. రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్నప్పుడు హైదరాబాద్ ను కేంద్రంగా పెట్టుకుని సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ నీ డెవలప్ చేశారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ గా మార్చేందుకు మూసీ కి పునరుజ్జీవనం కల్పించడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం. కానీ మూసీ విషయంలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నారు. మూసీలో నివసించే ప్రజలకు మంచి జీవితం అందించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని తెలిపారు భట్టి.

కిషన్ ఏం తెచ్చాడు: పొన్నం

‘‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నాము. గత ప్రభుత్వం వాటర్ లాగింగ్ పాయింట్స్ ను పట్టించుకోలేదు. ఇపుడు రహదారులపై నీరు నిల్వకుండా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చాం. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నాం. మూసీ ను అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారు. హైదరబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి తీసుకురాలేదు. హైదరాబాద్ లో తిరిగే ఆర్‌టీసీ బస్సులను దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Read More
Next Story