‘రెండో రాజధానిగా వరంగల్’.. ప్రకటించిన మంత్రి
x

‘రెండో రాజధానిగా వరంగల్’.. ప్రకటించిన మంత్రి

తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.


తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. మొత్తం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పేదలకు కష్టం తెలియకుండా పాలన అందిస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌లో అభివృద్ధి చెందిన నగరంగా అందరూ చెప్తున్నా.. హైదరాబాద్ కూడా ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా వరంగల్‌ను కూడా హైదరాబాద్‌కు ధీటుగా తెలంగాణకు రెండో రాజధాని అన్న రీతిలో అభివృద్ధి చేస్తామని, ఇతర రాష్ట్రాలకు వరంగల్‌ను ఆర్శంగా మలుస్తామని అన్నారు. అన్ని రంగాల్లో వరంగల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు వరంగల్‌లో ఉపాధి అవకాశాలు పెంచేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మరోసారి ఎన్నికలు వచ్చే సమయానికి వరంగల్‌ను పూర్తిగా మార్చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడేలా వరంగల్‌ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.

కేంద్రం అనుమతించడమే తరువాయి..

‘‘వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దుతాం. అన్ని రంగాల్లో ఔరా అనిపించేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. యువతకు సొంత నగరంలో ఉపాధి అవకాశాలు లభించేలా అభివృద్ధి చేస్తాం. సరికొత్త పరిశ్రమలను వరంగల్‌కు తీసుకొచ్చి నగరంలో ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచుతాం. అదే విధంగా దశాబ్దాల కాల మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు అవాంతరాలు తొలిగిపోయాయని, కేంద్రం అనుమతిస్తే ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తుంది. అదే విధంగా భద్రకాళి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తాం. భద్రకాళి జలాశయాన్ని తాగు నీటి జలాశయంగా మారుస్తాం. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. చెరువుపై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తాం’’ అని మంత్రి పొంగులేటి వివరించారు.

Read More
Next Story