
రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పై కేబినెట్ లో చర్చిస్తాం: పొంగులేటి
ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందని మంత్రికి వివరించిన బృందం
రిటైర్డ్ పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు పాత్రికేయులు గురువారం రాష్ట్ర సమాచార శాఖా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసారు. ఇతర రాష్ట్రాల్లో రిటైర్డ్ పాత్రికేయులకు ఇస్తున్న పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు తమకు కూడా కల్పించాలని రిటైర్డ్ పాత్రికేయ సంఘం కార్యవర్గ సభ్యులు లక్ష్మణరావు, రాజేశ్వర రావు, వేణుగోపాల్ , ఎన్ .శ్రీనివాస రెడ్డి, ఫాజిల్, ఉదయవర్లు, మల్లన్న, కేశవులు మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఈ విషయం పై ఒక కమిటీ వేసి, కేబినెట్ లో చర్చించి న్యాయం చేస్తానని హామి ఇచ్చారు.
Next Story