తెలంగాణలోనే కాదు ఢిల్లీలో తేల్చుకుంటామంటున్న కేటీఆర్
x

తెలంగాణలోనే కాదు ఢిల్లీలో తేల్చుకుంటామంటున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోపంగా ఉన్నారు. తమ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరడాన్ని సహించలేకపోతున్నారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోపంగా ఉన్నారు. తమ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరడాన్ని సహించలేకపోతున్నారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ అడ్డగోలుగా లాక్కుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలినవారంతా ఇతర పార్టీల నుంచి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో చేర్చుకున్నవాళ్ళే అనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదని వాళ్ళ సిట్టింగులని లాక్కోవడం మాత్రం కరెక్ట్ కాదనేది ఆయన బలంగా వాదిస్తున్న వాదన.

ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఏమన్నారంటే... యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందే కాంగ్రెస్, ఇప్పుడు వలసలను ప్రోత్సహిస్తోంది కూడా కాంగ్రెస్ పార్టీనే. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరు అని మండిపడుతున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారు. పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు కానీ తెలంగాణలో మాత్రం అదే చేస్తున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

"వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు?" అని కేటీఆర్ నిలదీశారు.

"గోవా, కర్ణాటక లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ... ఇప్పుడు తెలంగాణాలో BRS ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మణిపూర్ లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యేని సుప్రీం కోర్టు డిస్ క్వాలిఫై చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు? పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే సుప్రీం కోర్టుకి వెళ్తాం. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి కి ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఢిల్లీలో బయటపెడతాం" అని కాంగ్రెస్ ని, పార్టీ ఫిరాయించినవారిని కేటీఆర్ హెచ్చరించారు.

Read More
Next Story