కేటీఆర్ పై రు.100 కోట్ల పరువునష్టం దావా వేస్తాం
x

కేటీఆర్ పై రు.100 కోట్ల పరువునష్టం దావా వేస్తాం

ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ రు వంద కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమైంది. గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ,ఎమ్మెల్సీ దయాకర్ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై అద్దంకి ఫిర్యాదు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 నియామకాలపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఒక్కో గ్రూప్-1 పోస్టును రూ.3 కోట్లకు అమ్ముకుంటున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి ఆధారాలు లేకుండా పోస్టులు అమ్ముకున్నట్లు ఎలా ఆరోపణలు చేస్తారని దయాకర్ ప్రశ్నించారు.బాధ్యాతాయుతమైన పదవిలో వుండీ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు.

కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన గడువులోగా ఆయన స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేస్తామని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం లో చేసిన తప్పిదాలే ఇప్పుడు టీపీఎస్సీకి శాపంగా మారాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ యువత భవిష్యత్తుతో ఆటలాడుకోవడం మానుకోవాలని దయాకర్ హితవు పలికారు.
Read More
Next Story