ప్రభుత్వోద్యోగులపై దాడులు చేస్తే సహించం
x

ప్రభుత్వోద్యోగులపై దాడులు చేస్తే సహించం

విధులకు ఆటంకం కలిగించినా ఊరుకునేది లేదంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక.


తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేసినా, విధులకు ఆటంకం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తు అంధాకారమౌతుందన్నారు. గురువారం సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసి సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వోద్యోగులపై దాడులు జరిగినా, విధులకు ఆటంకం కలిగించినా బిఎన్ఎస్ లోని సెక్షన్ 221, 132, 121(1) సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, హిస్టరీ షీట్ తెరుస్తామని సజ్జనార్ అన్నారు. క్షణికావేశంలో చిన్న తప్పు చేస్తే జీవితం దుర్బరమౌతుందని, విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్టు జారీ కాదని, ప్రభుత్వోద్యోగాలకు ఇబ్బందులు ఎదరరౌతాయని సజ్జనార్ హెచ్చరించారు.

Read More
Next Story