కులవివక్ష తొలగించి, అందరికీ జాతి సంపద పంచుతాం : రాహుల్ గాంధీ
దేశంలో కులవివక్ష తొలగించి, అందరికీ జాతి సంపదను సమానంగా పంచేందుకు కృషి చేస్తామని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు.
ఏఐసీసీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి కుల గణనపై ఏర్పాటైన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.‘‘టైటానిక్ పడవను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు.కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని 20 నిమిషాల్లో మునిగిపోయింది,ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతా అంత లోతుగా ఉండి బయటకు కనిపించింది అది తెలియక ఆ పడవ కుప్ప కూలింది’’అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘టైటానిక్ పడవ లాగా నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉంది,దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది,మేం దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం.అందుకే కుల గణన అనేది అత్యంత కీలకం’’అని రాహుల్ చెప్పారు.
కులగణన చేస్తామంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు?
‘‘కులగణన చేస్తే ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలి,ఏదైనా వ్యాధి తెలియాలంటే ఎక్సరే చేయాలి కదా..మేం కుల గణన చేస్తాం ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే ప్రధాని మోదీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు’’అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.‘‘మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు.దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా..మేం దేశవ్యాప్తంగా కుల ఘనన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించాం’’అని రాహుల్ చెప్పారు.
తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శం
‘‘తెలంగాణ లో కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.తెలంగాణ కుల గణన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు. ప్రజల నుంచి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలి.తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది .దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది...మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు..అందుకే కుల వివక్ష తొలగించి అందరికీ సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తాం’’అని రాహుల్ గాంధీ వివరించారు.
Next Story