‘ఉన్నతమైన లక్ష్యం దిశగా అడుగులు వేస్తాం’
x

‘ఉన్నతమైన లక్ష్యం దిశగా అడుగులు వేస్తాం’

కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తామన్న కవిత.


కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అజెండాను జాగృతి తరుపున ముందుకు తీసుకెళ్తామని ఆమె అన్నారు. ‘‘ఉన్నత ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నాం. ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం. కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పని చేశాం.. పని చేస్తాం. ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి వన్నె తెస్తారు’’ అని ఆమె చెప్పారు.

Read More
Next Story