KCR | ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్-కవిత మధ్య ఏమి జరిగింది ?
x
KCR and Kavitha (file Photo)

KCR | ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్-కవిత మధ్య ఏమి జరిగింది ?

అమెరికా(America)కు వెళ్ళేముందు తండ్రి ఆశీర్వాదం అందుకోవాలన్న ఉద్దేశ్యంతో కొడుకును కవిత ఫామ్ హౌసుకు తీసుకెళ్ళారు


అంతా రహస్యంగానే ఉండిపోయింది. తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం కోసం కొడుకు ఆర్యాను తీసుకుని కూతురు కల్వకుంట్ల కవిత(Kavitha) ఎర్రవల్లి ఫామ్ హౌస్(Yerravalli Farm House) కు శుక్రవారం వెళ్ళారు. ఫామ్ హౌస్ లోకి కవిత కారు ఎంటరైన వీడియో మాత్రమే ట్విట్టర్లో కనబడింది. ఆతర్వాత ఏమి జరిగింది అన్నది అంతా రహస్యంగానే ఉండిపోయింది. ఆర్యా డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్ళాడు. అమెరికా(America)కు వెళ్ళేముందు తండ్రి ఆశీర్వాదం అందుకోవాలన్న ఉద్దేశ్యంతో కొడుకును కవిత ఫామ్ హౌసుకు తీసుకెళ్ళారు. అందరికీ ఇంతవరకే తెలుసు. ఫామ్ హౌస్ లోకి వెళ్ళిన కవిత కొడుకును కేసీఆర్(KCR) ఆశీర్వదించారా ? కూతురు, మనవడిని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడారా అన్నది ఎవరికీ తెలీదు. అయితే మనవడిని ఉద్దేశించి ‘బాగా చదువుకో’ అని చెప్పి కేసీఆర్ ఆశీర్వదించినట్లుగా మీడియాలో వార్తలు మాత్రం వచ్చాయి.

ఇపుడీ విషయం అంతా ఎందుకంటే అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కవిత విభేదించినప్పటి నుండి కూతురును కేసీఆర్ కూడా దూరంపెట్టేశారు. ఫామ్ హౌస్ లోకి ఎంటరయ్యేందుకు కవిత అనుమతి కూడా లేకుండా కట్టుదిట్టంచేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యే రోజున చాలామంది నేతలతో పాటు కవిత కూడా ఫామ్ హౌస్ లోకి వెళ్ళారు. తండ్రిని పలకరించినా కేసీఆర్ పట్టించుకోకుండా కారెక్కి విచారణకు వెళ్ళిపోయారు. అదంతా వీడియోల్లో కనబడింది. దాంతోనే కూతరంటే కేసీఆర్ ఎంతగా మండిపోతున్నారన్న విషయం అందరికీ అర్ధమైంది.

ఇటువంటి పరిస్ధితుల్లో కొడుకును తీసుకుని కవిత ఫామ్ హౌస్ కు వెళితే మరి కేసీఆర్ ఆశీర్వదించారా లేదా అన్న విషయమై ఎవరికీ క్లారిటిలేదు. ఎందుకంటే, మనవడిని కేసీఆర్ ఆశీర్వదిస్తున్న ఫొటోలు కాని, వీడియోలు కాని మీడియాలో ఎక్కడా కనబడలేదు. చివరకు కవిత ట్విట్టర్లో కూడా కనబడలేదు. దాంతోనే అందరికీ కేసీఆర్-కవిత, ఆర్యా భేటీ విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే మనవడిని కేసీఆర్ ఆశీర్వదించుంటే కవిత ఆ ఫొటోలు, వీడియోలను ట్విట్టర్ లో ఎందుకు పోస్టుచేయలేదు అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. కొడుకుతో కలిసి శనివారం ఉదయం అమెరికాకు వెళ్ళిన కవిత సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి హైదరాబాదుకు వస్తారు.

Read More
Next Story