ఆ ముగ్గురు ఏమయ్యారు ? కుటుంబసభ్యుల్లో పెరిగిపోతున్న ఆందోళన
x
Kurnool bus accident victims

ఆ ముగ్గురు ఏమయ్యారు ? కుటుంబసభ్యుల్లో పెరిగిపోతున్న ఆందోళన

. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 42మందిలో 22మంది చనిపోయారు


కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30-3 గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో(Kurnool bus accident) చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు (DNA Tests)జరుగుతోంది. ఫోరెన్సిక్ డాక్టర్లు మృతదేహాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 42మందిలో 22మంది చనిపోయారు. ప్రయాణీకుల్లో కొందరు ప్రమాదాన్ని గుర్తించి బస్సుల్లో నుండి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. బస్సు-మోటారు సైకిల్ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది.

ప్రయాణీకులందరు హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళుతున్నారు. హైదరాబాద్ లోని సూరారంలో ఇద్దరు ఎక్కగా జేఎన్టీయూ దగ్గర మరో ముగ్గురు ప్రయాణీకులు బస్సు ఎక్కారు. సూరారం దగ్గర బస్సు ఎక్కిన ఇద్దరిలో గుణసాయి బస్సులో నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. రెండో ప్రయాణీకుడి ఆచూకీ తెలీటంలేదు. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అనివస్తోంది. అలాగే జేఎన్టీయూ దగ్గర బస్సుఎక్కిన ముగ్గురిలో మరోకరు బస్సులో నుండి సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ అయిపోయాయి. మరణించిన 22మందిలో వీరు ముగ్గురు ఉన్నారా ? లేకపోతే ప్రాణాలతో బయటపడిన వారిలో ఈ ముగ్గురు ఉన్నారా అన్న విషయం తెలటంలేదు.

ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. బస్సులో నుండి మిగిలిన ముగ్గురు కూడా బయటపడుంటే వీరి మొబైల్ ఫోన్లు బస్సులో పడి కాలిపోయుండాలి లేకపోతే బ్యాటరీ అయిపోయి స్విచ్చాఫ్ అన్నా అయ్యుండాలని అనుకుంటున్నారు. ప్రమాదఘటన తెలియగానే కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏ విషయం తెలియాలంటే వెయిట్ చేయక తప్పేట్లులేదు. మిగిలిన ముగ్గురు కూడా ప్రమాదంలోనుండి సురక్షితంగా బయటపడాలనే కోరుకుందాము.

Read More
Next Story