
డాక్టర్ నమ్రత నేరాన్ని అంగీకరించిన వైనం ఎట్టిదనగా...
బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారు. పై విషయాలను నమ్రత ఒప్పుకొన్నారు.
ఎట్టకేలకు డాక్టర్ అత్తలూరి నమ్రత నేరాన్ని అంగీకరించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరిట ఆమె పలు నేరాలకు పాల్పడినట్టు సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు కేంద్రాలలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడిలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించారు.
ఈ విచారణలో ఆమె తన నేరాలను అంగీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సృష్టి ఫెర్టిలిటీ కేసుపై ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నమ్రత నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నేరాంగీకార పత్రంలోని వివరాల ప్రకారం.. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి పేరుతో నమ్రత రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు. ఏజెంట్లను నియమించుకొని పిల్లలను కొనుగోలు చేశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు డబ్బులు ఆశచూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారు. పై విషయాలతో పాటు.. పలు పోలీసు స్టేషన్లలో తనపై కేసులు నమోదైనట్లు నమ్రత ఒప్పుకొన్నారు.
డాక్టర్ నమ్రత వ్యవహారమై పలువురు ఫిర్యాదులు చేశారు. విశాఖపట్నం కేజీహెచ్ డాక్టర్లు కూడా కొందరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి మొత్తం 12మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Next Story