
KCR health | కేసీఆర్ కు అస్వస్ధత ?
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు సడెన్ గా ఆరోగ్యంలో తేడాలొచ్చేసిందని సమాచారం
అంతా రహస్యం..ఫామ్ హౌసులో ఏమి జరుగుతోందో తెలీదు..ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న వైద్యం ఏమిటో చెప్పటంలేదు. తరచూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నారు..ఇదంతా ఎవరిగురించి అనుకుంటున్నారా ? అవును, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) గురించే. శనివారం రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు సడెన్ గా ఆరోగ్యంలో తేడాలొచ్చేసిందని సమాచారం. విషయం తెలియగానే హుటాహుటిని కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తన ఇంటినుండి ఫామ్ హౌసుకు చేరుకున్నారు. డాక్టర్ల బృందానికి కూడా అర్జంట్ అంటు కబురు వెళ్ళింది. దాంతో డాక్టర్ల బృందం కూడా హైదరాబాదు(Hyderabad)కు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.
అదేసమయానికి మాజీమంత్రులు తన్నీరు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్ హౌసుకు చేరుకున్నారు. కేసీఆర్ ను పరీక్షించిన డాక్టర్లు వెంటనే వైద్యం మొదలుపెట్టారు. చెక్కెర, సోడియం స్ధాయిల్లో బాగా హెచ్చుతగ్గులను డాక్టర్లు గమనించారు. చెక్కెర, సోడియం స్ధాయిలను బ్యాలెన్స్ చేయటానికి డాక్టర్లు మందులిస్తున్నట్లు తెలిసింది. ఫామ్ హౌసులో వైద్యం సాధ్యంకాకపోతే వెంటనే హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయంఏమిటంటే గడచిన మూడునెలలుగా కేసీఆర్ ఆరోగ్యం ఏమాత్రం బాగుండటంలేదు. ఎందుకంటే నాలుగుసార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఫామ్ హౌసులో ఉన్నపుడు కూడా తరచూ జ్వరం వస్తోందని సమాచారం. ఆసుపత్రిలో చేరినప్పుడల్లా మూడు,నాలుగు రోజులు ఉంటున్నారు. ఇంతజరుగుతున్నా కేసీఆర్ అనారోగ్యం ఏమిటి ? డాక్టర్లు చేస్తున్న వైద్యం ఏమిటన్నది బయటవాళ్ళకు ఏమీ తెలీదు. కేసీఆర్ అనారోగ్యం గురించి కుటుంబసభ్యులు, డాక్టర్లు చాలా గోప్యత పాటిస్తున్నారు. బయటకు ఒక్క ముక్కకూడా పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌసులో నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సమయాల్లో కూడా అలసట, జ్వరంతో ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయని నేతలంటున్నారు. మొత్తానికి కేసీఆర్ అనారోగ్యంపై అంతా రహస్యంగా ఉంచుతున్నారని అర్ధమవుతోంది.