కేసీఆర్ స్పీచే హట్ టాపిక్ ?
x
KCR

కేసీఆర్ స్పీచే హట్ టాపిక్ ?

కేసీఆర్ స్పీచ్ లో నరేంద్రమోడీ(Narendra Modi) ప్రస్తావన కనీసం ఒక్కసారంటే ఒక్కసారికూడా లేకపోవటమే ఇఫుడు పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.


ఇపుడిదే విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయిపోయింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాల్లోకి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నుండి బయటకు వచ్చిన కేసీఆర్(KCR) ముందు పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్ళారు. సీఎం హోదాలో తాను ఇంతకాలం ఎంజాయ్ చేసిన డిప్లమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేసి రెగ్యులర్ పాస్ పోర్టును తీసుకున్నారు. తర్వాత బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్(Telangana Bhavan) కు చేరుకుని విస్తృతస్ధాయి సమవేశంలో పాల్గొన్నారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) తో పాటు మరికొందరు నేతలు మాట్లాడినా కేసీఆర్9KCR) ప్రసంగమే అందరినీ ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ స్పీచ్ లో నరేంద్రమోడీ(Narendra Modi) ప్రస్తావన కనీసం ఒక్కసారంటే ఒక్కసారికూడా లేకపోవటమే ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.

ఇంతకీ పార్టీ నేతలతో పాటు మామూలు జనాలను కూడా ఆశ్చర్యపరిచేంతగా కేసీఆర్ ఏమి మాట్లాడారు ? నిజానికి కేసీఆర్ స్పీచులో ఏమీకొత్తదనంలేదు. తమ తొమ్మిదేళ్ళ పాలనగురించి డప్పుకోట్టుకోవటం, రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై ఆరోపణలతో కేసీఆర్ రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ను ఓడించినందుకు జనాలంతా తెగబాధపడిపోతున్నారట. కాంగ్రెస్ హామీలను నమ్మి తాము మోసపోయామని ప్రజలు ఇపుడు బాగా ఫీలవుతున్నారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ధీమాను కేసీఆర్ వ్యక్తంచేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేసీఆర్ పాలనకన్నా రేవంత్ పాలన కాస్తలో కాస్త మెరుగు.

అవినీతి ఆరోపణలు కేసీఆర్ హయాంలోనూ ఉన్నాయి రేవంత్ పాలనలో కూడా వినబడుతున్నాయి. కాకపోతే అప్పట్లో అవినీతి ఆరోపణలు ఎక్కువగా కేసీఆర్ కుటుంబంచుట్టే తిరిగేవి. ఇచ్చిన హామీలను కేసీఆర్ కూడా నూరుశాతం నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితబంధు, రైతుబంధు లాంటి పథకాల్లో చాలా లొసుగులుండేవి. దళితుడికి మూడెకరాల వ్యవసాయభూమి ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఏర్పడితే దళితుడే మొదటి ముఖ్యమంత్రన్న బహిరంగ ప్రకటనను కేసీఆర్ తుంగలో తొక్కేశారు. అన్నింటికన్నా మించిన మైనస్ ఏమిటంటే వారాల తరబడి కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చేవారు కాదు. ఇక ఉద్యోగాల నియామకాలు, గ్రూప్ పరీక్షల నిర్వహణ అంతా అస్తవ్యస్ధమే.

ఇంతటి అధ్వాన్న పాలనను జనాలు మళ్ళీ కావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పటమే విచిత్రమని మంత్రులు సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వంమీద కాని నరేంద్రమోడీ మీదకాని కేసీఆర్ ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం. తన స్పీచ్ మొత్తంలో తనగురించి డప్పుకొట్టుకోవటం, రేవంత్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటమే చేసిన కేసీఆర్ కేంద్రప్రభుత్వం గురించి కాని నరేంద్రమోడీ ప్రభుత్వం గురించి కాని ఎందుకని ఒక్కమాట కూడ మాట్లాడలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టి ఆ స్ధానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అధికారంలో ఉందికాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను బీజేపీ చేయగలిగేది ఏమీలేదు. అందుకనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మీద బీజేపీ(BJP) టార్గెట్ పెట్టింది.

కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన కేసీఆర్ మోడి లేదా కేంద్రప్రభుత్వం మీద ఆరోపణలు చేయటానికే భయపడినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం బిడ్డ కవిత బెయిలే. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో కీలకపాత్రదారుగా దాదాపు ఏడుమాసాలు తీహార్ జైలు(Teehar Jail)లో గడపిన కవిత అతికష్టంమీద బెయిల్ పై బయటతిరుగుతున్నది. మోడీ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే బెయిల్ రద్దయి మళ్ళీ కవిత జైలుకు వెళుతుందేమో అన్న భయం కేసీఆర్ ను బాగా పీడిస్తున్నట్లుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకనే 2023 ఎన్నికలకు ముందు మోడీపై ఆకాశమంత ఎత్తున రెచ్చిపోయి నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన కేసీఆర్ ఇపుడు పొరబాటున కూడా మోడీ ప్రస్తావన తేవటంలేదు. మరి ఎంతకాలం మోడీ పేరు ఎత్తకుండా కేసీఆర్ ఉంటారో చూడాల్సిందే.

Read More
Next Story