
కేంద్ర బోర్డు వచ్చినా పసుపు పంటకు గిట్టుబాటు ధర ఏది?
తెలంగాణలో కేంద్ర పసుపు బోర్డు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.భారీవర్షాలు,దుంపకుళ్లుతో దిగుబడి తగ్గగా, ధర పడిపోయింది.దీంతో రైతులు ఆందోళనబాట పట్టారు.
ఈ ఏడాది భారీవర్షాలు, దుంపకుళ్లుతో పసుపు దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతోపాటు తాము కష్టపడి పండించిన పసుపునకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతన్నారు.ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 80వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. రాష్ట్రంలో 1.20 లక్షల ఎకరాల్లో పసుపు పంటను రైతులు వేశారు. పసుపు బోర్డు వచ్చిందని, మంచి ధర వస్తుందని పసుపు వేస్తే తమకు ధర రాక తీవ్రంగా నష్టపోయామని పసుపురైతుల సంఘం నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఏడాది భారీవర్షాల వల్ల దుంపకుళ్లు రోగం వచ్చి పసుపు దిగుబడి 35 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్లకు తగ్గింది. ఒక్కో రైతు పసుపు పంటలకు ఎరువులు, కలుపుతీత, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టడానికి ఎకరానికి లక్షరూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టారు. కనీసం తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని పసుపు రైతుల(Turmeric Farmers) సంఘం నాయకుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో పసుపు రైతులు రాస్తారోకో చేశారు. గత ఏడాది ఇదే సీజనులో పసుపు క్వింటాలుకు రూ.18 వేలు ధర పలకగా, ఈ ఏడాది రూ.8వేలకు తగ్గిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు రైతులు ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.
నెరవేరని పసుపు రైతుల ఆశలు
పసుపునకు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
నిజామాబాద్ మార్కెట్ లో రూ. 12000 కు అమ్ముడు పోయిన పసుపు, ఇప్పుడు రూ. 8000 కి అమ్ముడు పోతుంది
— BRS Party (@BRSparty) March 17, 2025
నిజామాబాద్ లోని ఖరీద్ దారులు కొందరు అధికారుల సహకారంతో సిండికేట్ అయ్యి పసుపు ధరను తగ్గిస్తున్నారు.
ఒకే రకమైన పసుపు నిజమాబాద్ లో ఒక రేటుకి, సాంగ్లిలో ఒక రేటుకి అమ్ముడుపోతుంది.
-… pic.twitter.com/4j8q3DhU58