ఎవరైనా ఇలాంటి చాలెంజ్ చేస్తారా ?
x
Harish Rao

ఎవరైనా ఇలాంటి చాలెంజ్ చేస్తారా ?

మాజీమంత్రి హరీష్ రావు మాటలు, ఆరోపణలు, విమర్శలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. మాటల్లో అయినా, ఆరోపణల్లో తాము ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామన్న అక్కసే కనబడుతోంది


మాజీమంత్రి హరీష్ రావు మాటలు, ఆరోపణలు, విమర్శలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. మాటల్లో అయినా, ఆరోపణలు, విమర్శల్లో అయినా తాము ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామన్న అక్కసే కనబడుతోంది, వినబడుతోంది. అలాంటిది ఆ దశలను దాటిపై తాజాగా రేవంత్ రెడ్డిని రాజీనామా చేద్దాం రమ్మంటు చాలెంజ్ విసిరారు. ఇంతకీ రాజీనామా చాలెంజ్ ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన రైతు రుణమాఫీ చేయలేకపోతేనట. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీకల్లా చేస్తానని రేవంత్ ఎన్నికల బహిరంగసభల్లో చెబుతున్నారు. రేవంత్ చెప్పేదంతా అబద్ధమేనని రైతు రుణమాఫీ చేయటం సాధ్యంకాదని కేసీయార్, కేటీయార్, హరీష్ పదేపదే అంటున్నారు.

తమ ఆరోపణలతో ఆగకుండా హరీష్ ఒక అడుగు ముందుకేశారు. ఇద్దరం రాజీనామా లేఖలను రెడీచేసి మధ్యవర్తికి ఇద్దాం రమ్మని రేవంత్ ను సవాలు చేశారు. నిజంగానే రుణమాఫీ చేసేంత చిత్తశుద్ది రేవంత్ లో ఉందా అనే అనుమానాన్ని హరీష్ వ్యక్తంచేశారు. రేవంత్ కు అంత సిన్సియర్ అయితే వెంటనే అమరవీరుల స్ధూపం దగ్గరకు రాజీనామా లేఖతో రావాలని చాలెంజ్ చేశారు. ఎప్పుడొచ్చేది చెబితే తాను కూడా రాజీనామా లేఖను తీసుకుని అమరవీరుల స్ధూపం దగ్గరకు వస్తానని చెప్పారు. ఇద్దరి రాజీనామా లేఖలను మధ్యవర్తి దగ్గర పెట్టాలట.

రేవంత్ గనుక రుణమాఫీ అమలుచేస్తే తన రాజీనామా లేఖను మధ్యవర్తులు స్పీకర్ కు ఇస్తారట. రుణమాఫీ చేయలేకపోతే రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్ కు ఇచ్చేస్తారట. ఇక్కడే హరీష్ ఆలోచనలు ఎంత విచిత్రంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఏ ముఖ్యమంత్రయినా తన రాజీనామా లేఖను మధ్యవర్తి దగ్గర ముందుగానే ఇస్తారా ? నిజంగానే హరీష్ చాలెంజ్ లో చిత్తశుద్ది ఉంటే తన రాజీనామా లేఖను రాసి మధ్యవర్తుల దగ్గర ఇస్తే సరిపోతుంది. హరీష్ రాజీనామా లేఖను ఇచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్కుగా రేవంత్ పైన మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది.

అయినా రుణమాఫీ చేయకపోతే అప్పుడు రైతులే ప్రభుత్వం విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మధ్యలో హరీష్ కు అంత ఆత్రం ఎందుకో అర్ధంకావటంలేదు. ఆగస్టు 15వ తేదీకి రుణమాఫీ చేస్తానన్న రేవంత్ మాటలను రైతాంగం నమ్మి ఎక్కడ కాంగ్రెస్ కు ఓట్లేసేస్తారో అన్న భయమే హరీష్ లో కనబడుతోంది. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రాజీనామా చేయాలి, లేకపోతే రేవంత్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరిపోతారనే గోలతప్ప ప్రశాంతంగా నాలుగురోజులు పరిపాలన మీద దృష్టిపెట్టనిచ్చింది ఎక్కడ ? కుర్చీ ఎక్కినదగ్గర నుండి దిగిపోమ్మనే డిమాండ్లే చేస్తుంటే జనాలకు చిర్రెత్తదా ? హరీష్.

Read More
Next Story