అయ్యయ్యో.. బషీర్ బాగ్ కేఫ్ బహార్ మూతపడిందే!
హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి హైదర్ గూడ వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ కేప్ బహార్. శుక్రవారం సాయంత్రం వేళల్లో, రంజాన్ ఇఫ్తార్ వేళల్లో రద్దీ చాలా ఎక్కువ.
హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి హైదర్ గూడ వెళ్తుంటే అనివార్యంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ కేప్ బహార్. శుక్రవారం సాయంత్రం వేళల్లో, రంజాన్ ఇఫ్తార్ వేళల్లో అక్కడ రద్దీ మామూలుగా ఉండదు. అటువంటి కేప్ బహార్ మూతపడిందంటే హైదరాబాద్ చరిత్రపై మమకారం ఉండే వాళ్లకి ఎక్కడో గుండెల్లో ముల్లుగుచ్చుకుంటున్నట్టు ఉంటుంది.
"హైదరాబాదీలు ఉపవాసం విరమించిన తర్వాత రంజాన్ స్పెషల్ కోసం వడివడిగా వెళ్లే కేప్ లలో ఇదొకటి. బషీర్‌బాగ్‌లోని కేఫ్ బహార్ లైట్లు దారినపోయే వాళ్లని ఆపి హలీమ్‌ను రుచి చూడకుండా ఎలా వెళ్తావన్నట్టుగా రెచ్చగొడుతుంది. లేదా ఓ కప్పు గరమ్ ఇరానీ చాయ్‌తో ఫ్రెష్‌గా ఉండమని వేడుకుంటున్నట్టుంటుంది. ఆ టెంప్టేషన్‌కు లొంగి నేను ఓ సీట్లో కంఫర్టబుల్ గా కూర్చున్నా. హలీమ్‌ను తెప్పించా. బిర్యానీకి ఆర్డర్ చేశా. చెంచాను తుడుచుకుంటూ కూర్చున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో హైదరాబాదీలకు తెలియందేమీ కాదు. అంత అమితంగా ఇష్టపడ్డా" అంటాడు "వైట్ మొఘల్స్" అనే పుస్తక రచయిత విలియం డాల్రింపుల్. పద్దెనిమిదవ శతాబ్దపు బ్రిటీష్ వారి అదృష్టాన్ని వెతకడానికి భారతదేశానికి వచ్చిన రచయిత ఈ విలియం.