కేసీయార్లో ఎంత మార్పు ?
x
KCR

కేసీయార్లో ఎంత మార్పు ?

అధికారంలో ఉన్నంతకాలం పొరబాటున కూడా ఉద్యమకరుల త్యాగాలఫలితమే తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావమని చెప్పటానికి ఇష్టపడేవారుకాదు.


కేసీయార్ కు దుఃఖం వస్తోందట. ఎందుకంటే తెలంగాణా సాధన రోజులు గుర్తుకొస్తే తనకు దుఃఖం వస్తోందన్నారు. ఎందరి త్యాగాలఫలంగానే ప్రత్యేక తెలంగాణా సాధ్యమైందన్నారు. అధికారంలో ఉన్న పదేళ్ళు చావునోట్లో తలపెట్టి తానే తెలంగాణా సాధించినట్లు కొన్నివేలసార్లు చెప్పుకున్నారు. అలాంటిది ప్రతిపక్షంలోకి రాగానే ‘ఎన్నో ప్రయాసలకోర్చి తెలంగాణాను సాధించుకున్నా’మని అందరినీ కలుపుకుని చెబుతున్నారు. సాధించాను అనేదానికి సాధించుకున్నామని చెప్పటానికి ఎంతతేడా ఉందో అర్ధమవుతోంది. అధికారంలో ఉన్నంతకాలం పొరబాటున కూడా ఉద్యమకరుల త్యాగాలఫలితమే తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావమని చెప్పటానికి ఇష్టపడేవారుకాదు. అలాంటిది ఇపుడు మాత్రం పదేపదే ఉద్యమకారులంటు పలవరిస్తున్నారు. అంటే ప్రత్యేక తెలంగాణా కోసం పోరాటాలుచేసిన వాళ్ళని, ఉద్యమకారులను కేసీయార్ కలుపుకుంటున్న విషయం అర్ధమైపోతోంది.

అందుకనే ప్రతిపక్షంలోకి రాగానే తెలంగాణా ఏర్పాటువిషయంలో కేసీయార్లో ఇంతలోనే ఎంతమార్పు వచ్చిందనే విషయంలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి, అంజయ్య, పీవీ నరసింహారావులను ఆరునెలలు కూడా ముఖ్యమంత్రులుగా ఉండనీయలేదని తెగ బాధపడిపోయారు. ముఖ్యమంత్రులుగా ఎక్కువకాలం ఉండలేదంటే అది పార్టీలో వాళ్ళ అంతర్గత వ్యవహారం. పైగా చెన్నారెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రయిన విషయాన్ని కేసీయార్ చెప్పలేదు. అలాగే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత చెన్నారెడ్డి ఇతర రాష్ట్రాల్లో గవర్నరుగా పనిచేశారు. పీవీ కేంద్రంలో చాలాసంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఫైనల్ గా ప్రధానమంత్రిగా ఐదేళ్ళు పనిచేసిన విషయాన్ని కేసీయార్ కావాలనే చెప్పలేదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళగురించి జాలిపడిన కేసీయార్ తనతో పాటు ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వారిలో ఎంతమందికి అధికారఫలాలను పంచారు ? తెలంగాణా సాధనకోసం జేయేసీ ఛైర్మన్ గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ ను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీయార్ దగ్గరకు కూడా రానీయని విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి అనేకమందిని అధికారంలో భాగస్వాములను చేసిన విషయం అందరు చూసిందే. కేసీయార్ తీసుకున్న ఇలాంటి వాళ్ళకే కేసీయార్ వ్యతిరేకులు ముద్దుగా బంగారు తెలంగాణా బ్యాచ్(బీటీ బ్యాచ్) అని పిలిచేవాళ్ళు. తెలంగాణా ఉద్యమకారుల్లో చాలామందిని పదేళ్ళు దూరంగా పెట్టేసిన కేసీయార్ కూడా ఉద్యమరోజులను తలచుకుంటే దుఃఖంవస్తోందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story