ఈ ఎంఎల్ఏకి ఏమైంది ? ఎందుకెళ్ళారు ? ఎందుకు తిరిగొచ్చేశారు ? (వీడియో)
x
MLA Bandla with KTR

ఈ ఎంఎల్ఏకి ఏమైంది ? ఎందుకెళ్ళారు ? ఎందుకు తిరిగొచ్చేశారు ? (వీడియో)

ఈ ఎంఎల్ఏకి ఏమైందో ఎవరికీ అర్ధంకావటంలేదు. అప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారో ? ఇపుడు మళ్ళీ ఎందుకు తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేశారో అంతుబట్టడంలేదు.


ఈ ఎంఎల్ఏకి ఏమైందో ఎవరికీ అర్ధంకావటంలేదు. అప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారో ? ఇపుడు మళ్ళీ ఎందుకు తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేశారో అంతుబట్టడంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే 15 రోజుల క్రితమే మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల బీఆర్ఎస్ ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సడెన్ గా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయాన్ని అందరు చూసిందే. అయితే ఆ ఎంఎల్ఏకి ఏమైందో ఏమో మంగళవారం సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ కండువా తీసేసి తిరిగి కారెక్కేశారు.



అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను పార్టీలోకి తిరిగొచ్చేస్తున్నట్లు చెప్పారట. వెంటనే కేటీఆర్ కూడా హ్యాపీగా పార్టీలోకి ఆహ్వానించేశారు. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాసయాదవ్, జగదీష్ రెడ్డి తదితరులతో బండ్లను కూడా కేటీఆర్ తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. బండ్ల భుజంపై చెయ్యేసిన కేటీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. బండ్ల చర్యతో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ కొట్టినట్లే అయ్యింది. కేటీఆర్ తో బండ్ల కూర్చున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ను వద్దనుకుని కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కారుపార్టీలోకి ఎందుకు చేరుతారు ? చేరారు ? అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. అసెంబ్లీ లాబీల్లో వెళుతున్నపుడు కేటీఆర్ కనిపించటంతో బండ్ల మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశారా ? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తాను తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఇంతవరకు బండ్ల ఎక్కడా ప్రకటించలేదు. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్విట్టర్ లో అయితే బండ్ల తిరిగి కారుపార్టీలో చేరినట్లుగా ప్రచారం అవుతోంది. బండ్ల ప్రకటన చేసేంతవరకు విషయంలో సస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంటుంది.

Read More
Next Story