Bandi Sanjay | ‘కేటీఆర్ భాష సరిగా లేదు’
x

Bandi Sanjay | ‘కేటీఆర్ భాష సరిగా లేదు’

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.


ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. అసలు కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు ఎందుకు చేయాలి? అని ప్రశ్నించారు. అవినీతి చేయలేదని చెప్తున్న కేటీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారేని, ముందు కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు బండి సంజయ్. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అవినీతిమయం అంటూ చురకలంటించారు. అనంతరం దేశవ్యాప్తంగా రైల్వే శాఖను అభివృద్ధి చేయడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆ దిశగా అన్ని నగారాల్లోని పలు రైల్వే స్టేషన్లను అత్యఆధునికంగా తీర్చిదిద్దుతోందని అన్నారు. అందులో భాగంగా కరీంనగర్‌లో చేస్తున్న రైల్వే పనులను సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు.

‘‘అమృత్ భారత్ స్కీం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ 1300 రైల్వే పనులని పునరుద్దరిస్తున్నారు. మార్చిలోపు కరీంనగర్ రైల్వే స్టేషన్‌ని ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రూ.95 కొట్లతో కరీంనగర్ రైల్వే స్టేషను పనులు జరుగుతున్నాయి. సకల సౌకర్యాలతో మాడల్ రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుతాం. కరీంనగర్ అర్వోబి పనులు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అగిపోయింది. సేతుబంధు స్కీం ద్వారా కేంద్రప్రభుత్వం నిధులతో అర్వోబి పనులు చేస్తున్నాం...కేంద్రం వందశాతం పూర్తి నిధులు కెటాయించింది. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. భూసేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఉప్పల్ అర్వోబీ పనులని అరునెలలలో పూర్తి చేస్తాం’’ అని బండి సంజయ్ ప్రకటించారు.

కేటీఆర్ ప్లాన్ అదే..

అనంతరం కేటీఆర్ అంశంపై ఘాటుగా స్పందించారు. కేటీఆర్, కేసీఆర్ అనే వ్యక్తులు అవినీతికి మారురూపాలన్న స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘కేటీఆర్ బాష సరిగా లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి,కేసీఆర్ కుటుంబం కి మధ్య ఎదో ఒప్పందం ఉంది. కేటీఆర్ అరెస్టు అయితే ఎందుకు‌ ఆందోళన చేయాలి. అవినీతి ఆరోపణలపై కేటీఆర్ జైలుకు పోతే ఎందుకు అందోళనలు..అయన ఎమైనా దేశం కోసం పోరాడడా. కేసీఆర్ కుటుంబం అంటెనే అవినీతి కుటుంబం. రూ.700 కొట్ల లాభాలు ఎక్కడ వచ్చాయో కేటీఆర్ చూపాలి. రూ.700 కొట్లు దొబ్బిపోవాలని కేటీఆర్ ఫ్లాన్ చేశారు. కేబినెట్ అమోదం లేకుండా డబ్బులు ఎలా చెల్లిస్తారు. రైతులకి రుణమాఫి, పంట నష్టపరిహారం ఇవ్వడానికి లేని ఆతృత.. ఫార్ములా రేసుకు ఎందుకు. డ్రగ్స్ కేసుల మీద కేసీఆర్ కుటుంబాన్ని ఎం చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ చేసేది లొట్టపిసు. ఢిల్లీకి పోయి కప్పం కడితే అన్ని కేసులు మాఫీ అవుతాయి. కేసీఆర్ కుటుంబం అవినీతి బయట పెట్టడమే బిజేపి లక్ష్యం’’ అని తెలిపారు.

Read More
Next Story