
తెలంగాణలో విస్తారంగా వర్షాలు,ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో వర్షాలపై ఐఎండీ శుక్రవారం ఉదయం వెదర్ రిపోర్టు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న విడుదల చేసిన తాజా వెదర్ రిపోర్టులో వెల్లడించారు.ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల,ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని శుక్రవారం ఉదయం ఏడు గంటలకు వాతావరణశాఖ విడుదల చేసిన వెదర్ రిపోర్టులో పేర్కొంది.ఆరు జిల్లాల్లో శుక్రవారం ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.
ఏడు జిల్లాల్లో మెరుపు వరదలు
రికార్డు స్థాయిలో వర్షాలు
పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
తెలంగాణ రాస్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ శుక్రవారం 8 గంటలకు విడుదల చేసిన ఎక్స్ పోస్టులో తెలిపారు. రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేటలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షాలు , కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చిన్నపాటి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.నగరంలో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌లలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షాలు కురవ వచ్చని వెదర్ మ్యాన్ వివరించారు.