కోకాపేటలో దారుణం
x

కోకాపేటలో దారుణం

భర్త కడుపులో కత్తితో పొడిచి హత్య చేసిన భార్య


రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో మరో దారుణం చోటు చేసుకుంది . తాళి కట్టిన భర్తను అత్యంత కర్కషంగా భార్య హత్య చేసింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో భార్య కత్తితో భర్త కడుపులో పొడిచింది.

బతకుతెరువు కోసం కోసం దంపతులు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్‌లో కూలి నాలి పనులు చేసుకుంటూ జీవనం‌ సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గత అర్ధరాత్రి కూడా చిన్న విషయానికి భార్యాభర్తలు తగువుపడ్డారు.

మద్యం తాగివచ్చిన భర్త భరత్ బోరా భార్యను కొట్టేవాడని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

భర్త వేధింపులు తాళలేక భార్య విచక్షణ కోల్పోయింది. అతడి కడుపులో కత్తితో పొడిచింది. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. భరత్ కేకలు విన్న స్థానికులు లోపలికి వచ్చి చూడగా భర్త అప్పటికే రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే భర్తను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే నార్సింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్య భర్తల మధ్య ఏ రకమైన గొడవలున్నాయి అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా భార్య ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అక్రమ సంబంధం కారణంగా..

మూడు రోజుల క్రితం మహబూబ్ బాద్ జిల్లా గడ్డి గూడెంలో రశ్మిత అనే మహిళ భర్తపై హత్యాయత్నం చేసింది. ప్రియుడిని అర్ధరాత్రి పిలిచి భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నింది. ఇంట్లో నుంచి పెద్ద పెద్ద అరుపులు రావడంతో స్థానికులు అప్రమత్తమై ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రియుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. రశ్మిత పెళ్లయినప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్ చేసి రష్మిత విఫలమైంది.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ..

మూడు వారాల క్రితం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య కట్టుకున్న భర్తను హత్య చేసింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని భార్యభర్తలు డిసైడ్ అయ్యారు. తొలుత భర్త రామకృష్ణారెడ్డిని భార్య రమ్య కత్తితో గొంతుకోసి హత్య చేసింది. భర్త చనిపోయిన తర్వాత భార్య ఆత్మహత్య చేసుకోవాలి . కాని భార్యకు ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలలేదు.చివరకు పోలీసులకు సమాచారమిచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. గుంటూరు నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన భార్య భర్తలు అనేక వ్యాపారాలు చేసి నష్ట పోయారు. అప్పులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణలో గత నెల రోజుల వ్యవధిలో జరుగుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.


Read More
Next Story