ఇక్కడ బీజేపీ జాక్ పాట్ కొడుతుందా ?
x
BJP in Bhongiri LS poll

ఇక్కడ బీజేపీ జాక్ పాట్ కొడుతుందా ?

ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ గెలుస్తారనే మౌత్ పబ్లిసిటీ విపరీతంగా ఉంది.


ఊహించని రీతిలో లాభం వస్తే జాక్ పాట్ అనటం మామూలే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి గెలిస్తే జాక్ పాట్ కొట్టినట్లుగానే అనుకోవాలి. ఎందుకంటే స్ధానిక పరిస్ధితులు అలాగ ఉన్నాయి కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ తరపున మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా క్యామ మల్లేష్ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. బీసీల ఓట్లను గౌడ్ సామాజికవర్గానికి చెందిన బూర, కురమ సామాజికివర్గానికి చెందిన క్యామ చీల్చుకోవాలి. అయితే క్యామకు అంత సీనుందా అన్నదే అసలైన పాయింట్.

ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ గెలుస్తారనే మౌత్ పబ్లిసిటీ విపరీతంగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే జాతీయస్ధాయిలో నరేంద్రమోడి ఇమేజి, అయోధ్యలో రామాలయం నిర్మాణం సెంటిమెంట్. మొదటిసారి ఓటు వేయబోతున్న యూత్ కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీంతో అభ్యర్ధితో సంబంధంలేకుండానే కొన్ని ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉందని అర్ధమవుతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో కలుపుకున్నా బీజేపీకి లక్ష ఓట్లు రాలేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని జరగుతన్న ప్రచారమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటుంది. అదేమిటంటే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఎంఎల్ఏలే ఉన్నారు. ఒక్కచోట బీఆర్ఎస్ ఎంఎల్ఏ ఉన్నారు. ఒక్క ఎంఎల్ఏ కూడా లేని బీజేపీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందని ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు పరిధిలోని ఇబ్రహింపట్నం అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున మల్ రెడ్డి రంగారెడ్డి గెలిచారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలిచారు. భువనగిరి అసెంబ్లీలో కుంబం అనీల్ కుమార్ రెడ్డి విజయంసాధించారు. నకిరేకల్(ఎస్సీ) నియోజకవర్గంలో వేముల వీరేశం ఎంఎల్ఏగా ఉన్నారు. తుంగతుర్తి (ఎస్సీ) నియోజకవర్గంలో మందుల శామ్యూల్ ఎంఎల్ఏ. ఆలేరులో బీర్ల ఐలయ్య ఎంఎల్ఏగా గెలిచారు. జనగాంలో మాత్రమే బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వరరెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు.

పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీల్లో మోజారిటి ఎంఎల్ఏలు ఉన్న పార్టీయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా గెలుస్తుందని అనుకోవటం సహజం. కాని ఇక్కడ రివర్సులో ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు పరిధిలో సుమారు 15 లక్షల ఓట్లుంటాయి. ఇందులో బీసీల ఓట్లే మెజారిటి. అందులో కూడా గౌడ్లు సుమారు 3 లక్షలు, కురమ 2 లక్షలు, పద్మశాలీల ఓట్లు మరో లక్షన్నర ఓట్లుంటాయి. ఎస్సీల ఓట్లు 2.5 లక్షల దాకా ఉంటాయి. మునుగోడు, జనగామ, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల్లో పద్మశాలీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

బీజేపీ గెలుపు విషయంలో జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జిల్కపల్లి సుదర్శనరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణా’తో మాట్లాడుతు బీజేపీ గెలుస్తుందన్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. మొదటిసారి ఓట్లేయబోతున్న యూత్ మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. బీజేపీ అభ్యర్ధి గెలవటానికి రెండుఅవకాశాలు ఉన్నాయన్నారు. అవేమిటంటే గౌడ్లంతా బూరను గెలిపించుకోవాలని గట్టిగా అనుకోవటం. రెండో అవకాశం బీఆర్ఎస్ నుండి బీజేపీకి భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగటం. పై రెండు గనుక జరిగితేనే బూర నర్సయ్యకు గెలుపు అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఈ రెండూ జరిగేవి కావు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డే గెలుస్తారని థీమా వ్యక్తంచేశారు.

Read More
Next Story