Janareddy and Balaiah|జానారెడ్డి, బాలయ్యకు షాక్ తప్పదా ?
x
Janareddy and Balaiah Houses

Janareddy and Balaiah|జానారెడ్డి, బాలయ్యకు షాక్ తప్పదా ?

రోడ్డు విస్తరణలో బాగంగా చాలామంది ప్రముఖల ఇళ్ళస్దలాలు పోతున్నాయి. ఇందులో భాగంగానే జానారెడ్డి(Janareddy), బాలయ్య(Balaiah) ఇళ్ళ స్ధలాలు కూడా పోవటం ఖాయమైపోయింది.


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, చంద్రబాబునాయుడు బావమరది కమ్ వియ్యంకుడు కమ్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు షాక్ తప్పదని అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రోడ్డు విస్తరణలో బాగంగా చాలామంది ప్రముఖల ఇళ్ళస్దలాలు పోతున్నాయి. ఇందులో భాగంగానే జానారెడ్డి(Janareddy), బాలయ్య(Balaiah) ఇళ్ళ స్ధలాలు కూడా పోవటం ఖాయమైపోయింది. ఈ మేరకు ఇళ్ళకాంపౌడ్లలో ఎంతమేర స్ధలాన్ని ప్రభుత్వం తీసుకోబోతోందనే విషయాన్ని మున్సిపల్ అధికారులు ఇప్పటికే సర్వేచేసి మార్కింగ్ చేయటం రెండు పార్టీల్లోను పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేబీఆర్ పార్క్(KBR Park) చుట్టూ రోడ్ల విస్తరణ, స్టీల్ బ్రిడ్జీలు, అండర్ పాసులను నిర్మించాలని రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం డిసైడ్ చేసింది. స్టీల్ ఫ్లైఓటర్లు, రోడ్ల విస్తరణ, అండర్ పాస్ నిర్మాణం విషయంలో రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకని ఇపుడున్న పార్క్ చుట్టూ భూసేకరణ అనివార్యమైంది. భూసేకరణ చేయాలంటే పార్కు చుట్టూ ఎక్కడా ఖాళీస్ధలం కాని లేదా ప్రభుత్వ స్ధలంకాని లేదు. పైగా చుట్టూ అత్యంత ప్రముఖల విలాసవంతమైన బంగళాలున్నాయి.

అందుకనే ప్రముఖుల ఇళ్ళయినా సరే ప్రహరీగోడలను కూల్చేసి ఇళ్ళస్ధలాలను భూసేకరణ కింద తీసుకోవాల్సిందే అని రేవంత్ ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు రావటమే ఆలస్యం వెంటనే మున్సిపల్ శాఖ సర్వే అధికారులు రంగంలోకి దిగేశారు. భూసేకరణలో సేకరించాల్సిన భూమి ఎంత ? కూల్చాల్సిన ప్రముఖుల ఇళ్ళప్రహరీలెన్ని? కాంపౌడ్ వాల్స్ కూల్చటం ద్వారా అందుబాటులోకి రాబోయే భూమిఎంత ? దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలను రిపోర్టు రూపంలో రేవంత్ కు అందించారు. రేవంత్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే సర్వే అధికారులు ప్రముఖల ఇళ్ళలోపల కొలతలు వేసి ఎంతమేరకు భూమి సేకరించబోతున్నారనే విషయాలను ఫైనల్ చేసి మార్కింగ్ కూడా చేశారు.

ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం వెంటనే కాంపౌడ్ వాల్స్ కూల్చేసి అవసరమైన భూమిని సేకరించటానికి రంగం సిద్ధంగా ఉంది. జానారెడ్డి, బాలయ్య ఇళ్ళతో పాటు అల్లుఅర్జున్ మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి, రెండు మీడియా యాజమాన్యాల ఇళ్ళు, కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్ళకు కూడా మార్కింగ్ చేశారు. కొందరు బాధితులతో మున్సిపల్ ఉన్నతాధికారులు మాట్లాడి భూసేకరణకు అవసరమైన అంగీకారం తీసుకున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. నిజానికి తొందరలో మొదలవబోతున్న ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలోనే మొదలయ్యాయి. కేబీఆర్ పార్క్ అన్నది జాతీయ పార్కుల జాబితాలో ఉంది. కాబట్టి డెవలప్మెంట్ పేరుతో ఎలాపడితే అలా పనులు మొదలుపెట్టేందుకు లేదు. ఎందుకంటే పార్కు చుట్టూ కొంతభూమిని ‘ఎకో సెన్సిటివ్ జోన్’ గా డిసైడ్ అయ్యింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేసేందుకు లేదు. అయితే ఈనియమాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఫ్లైఓవర్ల నిర్మాణానికి రెడీ అయ్యింది. దాంతో కొందరు పర్యావరణవేత్తలు జాతీయ హరిత బ్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్ స్టే ఇవ్వటంతో పనులను కేసీఆర్ ప్రభుత్వం నిలిపేసింది.

ఆ విషయాలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ ప్రభుత్వం చేయబోయే నిర్మాణాలను ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి రాకుండా డిజైన్లు రెడీ చేయించింది. దాంతో ఆరు స్టీల్ బడ్జీలు, రోడ్ల విస్తరణ, అండర్ పాసుల నిర్మాణాలు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి రాకపోవటంతో పర్యావరణవేత్తలు అభ్యంతరాలు చెప్పలేదు. అందుకనే భూసేకరణలో సర్వేఅధికారులు స్పీడుపెంచారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45, చెక్ పోస్టు రోడ్లు కేబీఆర్ పార్క్ విస్తరణ ప్రాజెక్టులోకి వస్తాయి. ఈప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం రు. 1200 కోట్ల అంచనాతో మొదలుపెట్టబోతోంది.

ఇపుడు విషయం ఏమిటంటే జానారెడ్డికి ఒమేగా ఆసుపత్రికి దగ్గరలో రెండు ప్లాట్లున్నాయి. వీటిలో 43 అడుగుల చొప్పున రోడ్డు విస్తరణకోసం సేకరించాలని సర్వే అధికారులు నిర్ణయించారు. 43 అడుగుల చొప్పున అంటే రెండు ప్లాట్లలో సుమారు 700 గజాలను ప్రభుత్వం తీసుకోవచ్చు. అలాగే బాలయ్య ఇల్లు రోడ్డు నెంబర్ 45, 92లో వస్తుంది. కాబట్టి రెండువైపులా భూసేకరణ తప్పదు. అందుకని బాలయ్య కాంపౌండులో కూడా 700 గజాల స్ధలాన్ని కోల్పోకతప్పదు. అలాగే మరికొందరు ప్రముఖుల ఇళ్ళల్లో కూడా సగటున 500 గజాల స్ధలాన్ని మున్సిపల్ శాఖ సేకరించబోతోంది. భూసేకరణ అంటే ఇఫుడున్న ప్రభుత్వ ధరకు మూడురెట్లు అదనంగా నష్టపరిహారంగా అందుకుంటారని అందరికీ తెలిసిందే. బంజారాహిల్స్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు 6.5 కిలోమీటర్ల రోడ్డును విస్తరించబోతోంది ప్రభుత్వం. ఇందుకోసం 306 ఇళ్ళలో స్ధలాలు సేకరించబోతోంది. ఇప్పటికే 86 ఇళ్ళకు సంబంధించిన సర్వే పూర్తయ్యింది. పూర్తయిన సర్వేలోనే జానారెడ్డి, బాలయ్య, చంద్రశేఖరరెడ్డి, మీడియా యాజమాన్యాల్లాంటి ప్రముఖల ఇళ్ళున్నాయి. మరి మిగిలిన ఇళ్ళ సర్వే కూడా పూర్తయితే ఇంకెంతమంది ప్రముఖుల ఇళ్ళు జాబితాలోకి ఎక్కుతాయో చూడాలి.

Read More
Next Story