కేసీయార్ కు డెడ్ లైన్ టెన్షన్
x
KCR

కేసీయార్ కు డెడ్ లైన్ టెన్షన్

కేసీయార్ కోరినట్లుగా గడువు ఇవ్వటానికి కమీషన్ అంగీకరించలేదు. తాము అడిగినట్లు జూన్ 15వ తేదీలోగా సమాధానం ఇవ్వాల్సిందే అని స్పష్టంగా చెప్పింది.


జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ కు సమాధానం ఇవ్వటానికి శనివారం మాత్రమే డెడ్ లైన్. ఆరోపణలపై సమాధానం చెప్పాలని కమీషన్ ఇదివరకే కేసీయార్ కు నోటీసిచ్చింది. ఆ నోటీసులో జూన్ 15వ తేదీలోగా తమకు వివరణ కావాలని కోరింది. కేసీయార్ మాత్రం సమాధానం చెప్పటానికి జూలై 30 వరకు గడువు కోరారు. అయితే కేసీయార్ కోరినట్లుగా గడువు ఇవ్వటానికి కమీషన్ అంగీకరించలేదు. తాము అడిగినట్లు జూన్ 15వ తేదీలోగా సమాధానం ఇవ్వాల్సిందే అని స్పష్టంగా చెప్పింది.

విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ కు కేసీయార్ కు మధ్య ఏమి జరుగుతున్నదో అర్ధంకావటంలేదు. కమీషన్ అడిగినట్లుగా కేసీయార్ శనివారమే వివరణ ఇస్తారా ఇవ్వరా అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. సమాధానం ఇస్తే అందులో ఏముంటుంది ? ఇవ్వకపోతే కేసీయార్ విషయంలో కమీషన్ ఏమిచర్యలు తీసుకుంటుందనే విషయం ఆసక్తిమారింది. కేసీయార్ నుండి శుక్రవారం రాత్రికి కూడా ఎలాంటి వివరణా అందలేదని కమీషన్ వర్గాలు చెప్పాయి. ఒకవేళ కమీషన్ నుండి శనివారం లోగా సమాధానం అందకపోతే కమీషన్ ఏమి చేస్తుందనే విషయమై ఇపుడు పార్టీతో పాటు జనాల్లో కూడా చర్చలు పెరిగిపోతున్నాయి. సమాధానం రాకపోతే కమీషన్ మూడు రెండుమార్గాలను అనుసరించవచ్చని తెలిసింది.

అవేమిటంటే మొదటిది శనివారం రాత్రిలోగా సమాధానం రాకపోతే ఇంకోసారి నోటీసిచ్చే అవకాశం ఉందట. రెండోనోటీసులో సమాధానం ఇవ్వటానికి మరో గడువు విధించే అవకాశం ఉంది. ఇక రెండో మార్గం ఏమిటంటే నోటీసుకు సమాధానం రాలేదుకాబట్టి మరో నోటీసిచ్చి డైరెక్టుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించే అవకాశముంది. మరి ఈ రెండింటిలో కమీషన్ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందనేది కేసీయార్ వైఖరిపైన ఆధారపడుంది. కమీషన్ తో ఘర్షణ వైఖరిని కేసీయార్ ఎంచుకుంటే అసలు సమాధానమే చెప్పారు. ఒకవేళ సమాధానం చెప్పినా ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధంలేదనంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన కూడా ఒక టివీ చర్చలో ఇలాగే సమాధానం ఇచ్చారు. పోలీసులకు ప్రభుత్వానికి సంబంధంలేదన్నట్లుగా మాట్లాడారు. పోలీసులు ట్యాపింగ్ చేస్తే తనకేమి సంబంధమనే విచిత్రమైన వివరణిచ్చారు. ట్యాపింగ్ ను పోలీసులు తనకు చెప్పి చేస్తారా ? ళ ట్యాపింగ్ లో నిబంధనలను అతిక్రమించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కూడా కేసీయార్ ఉచిత సలహాపడేశారు.

విద్యుత్ కొనుగోళ్ళ, ఉత్పత్తికేంద్రాల ఏర్పాటులో అవినీతిపైన కూడా కేసీయార్ ఇలాంటి వివరణ ఇచ్చే అవకాశాలే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోళ్ళు, యాదాధ్రి, భద్రాద్రిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ను నియమించింది. ఈ కమీషన్ ఇప్పటికే కేసీయార్ హయాంలో విద్యుత్ రంగంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకరరావుతో పాటు అనేకమంది ఉన్నతాధికారులను విచారించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో టెండర్ విధానాన్ని పాటించకుండా నామినేషన్ మీద కేసీయార్ ప్రాజెక్టులను అప్పగించేశారన్నది ఆరోపణ. అలాగే ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలుకు అవసరంలేకపోయినా అధిక ధరలు చెల్లించి ప్రభుత్వంపై ఆర్ధికభారం మోపటమే కాకుండా వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.

ఈ ఆరోపణలపైనే నరసింహారెడ్డి కమీషన్ విచారణ చేస్తోంది. ఉన్నతాధికారులను విచారించటమే కాకుండా విద్యుత్ రంగంలో నిపుణులతో మాట్లాడి పదేళ్ళలో ఏమి జరిగిందనే సమాచారాన్ని రాబడుతోంది. అన్నీవైపుల నుండి సమాచారం తీసుకుంటునే కేసీయార్ ను వివరణ కోరుతు నోటీసులు జారీచేసింది. ఈ నేపధ్యంలోనే డెడ్ లైన్ విషయంలో కేసీయార్ ఏమిచేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Read More
Next Story