ముఖ్యమంత్రిని కోర్టుకు లాగుతా: కెటిఆర్
x

ముఖ్యమంత్రిని కోర్టుకు లాగుతా: కెటిఆర్

చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం


తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతా అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.

‘‘కెటిఆర్ ఫ్రెండ్ కేదార్ దుబాయ్ లో గంజాయి సేవించి చనిపోయాడు. ఆ ఫోరెన్సిక్ రిపోర్టు తెలంగాణకు తెప్పించాం’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఢిల్లీలో చిట్ చాట్ లో అన్న నేపథ్యంలో కెటిఆర్ స్పందించారు. నేను గంజాయి తీసుకున్నానని రేవంత్ రెడ్డి నిరూపించాలి లేకుంటే కోర్టుకు లాగుతా అని కెటిఆర్ హెచ్చరించారు.

కెటిఆర్ ఉత్త గంజాయి బ్యాచ్ . కెటిఆర్ చుట్టూ ఉండేవాళ్లు ఉత్త గంజాయి బ్యాచ్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Read More
Next Story