మహిళా ఆర్మీ ఆఫీసర్ అనుమానాస్పద మృతి
రాత్రి డ్యూటి నుండి ఇంటికి వెళ్ళిన ఆపీసర బల్ల గంగాభవాని ఉదయానికి ఇంట్లో చనిపోయున్నారు.
తెలంగాణాకు చెందిన మహిళా ఆర్మీ ఆఫీసర్ గుజరాత్ లో చనిపోయారు. రాత్రి డ్యూటి నుండి ఇంటికి వెళ్ళిన ఆపీసర బల్ల గంగాభవాని ఉదయానికి ఇంట్లో చనిపోయున్నారు. డ్యూటీకి రాకపోవటంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఇంటికి వెళ్ళిచూడగా ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్ధితులు ఆమెకు లేకపోవటంతో అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. గుజరాత్ బార్డర్ ఫోర్సులో గంగాభవాని పనిచేస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగి ప్రస్తుతానికి గుజరాత్ బార్డర్ ఫోర్సులో పనిచేస్తున్నారు.
గోదావరి ఖనిలోని ఇండస్ట్రియల్ కు చెందిన గంగాభవాని ఈమధ్యనే రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి గుజరాత్ కు వెళ్ళారు. 7వ తేదీన డ్యూటి ముగించుకుని శనివారం రాత్రికి క్వార్టర్స్ కు వెళ్ళారు. మరుసటి రోజు అంటే ఆదివారం డ్యూటికి రాకపోవటంతో విషయం తెలుసుకుందామని సిబ్బంది ఆమె క్వార్టర్స్ కు వెళ్ళారు. తనింట్లోనే ఉరివేసుకుని సిబ్బందికి కనిపించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమె కుటుంబసభ్యులకు విషయం చేరవేశారు. ఆమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు తీసుకొచ్చిన అధికారులు కుటుంబసభ్యులకు అందించారు. ఆమె మృతిపై తల్లి, దండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కాని మృతికి కారణం తెలీదు.