
హైదరాబాద్ లో మహిళా మృతదేహాల కలకలం
ఒకే రోజు రెండు డెడ్ బాడీలపై లోతైన దర్యాప్తు
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు మహిళా మృత దేహాలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం ఒక మహిళ మృత దేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చారు. చేతులు, కాళ్లు కట్టి ఉన్న మృత దేహాన్ని గోనె సంచిలో ఉంది. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయినట్టు సీసీ టీవీలో రికార్డయ్యింది. మహిళా మృత దేహాం 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రత్యేక బృందాలు దర్యాప్తును వేగవంతం చేశారు. మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
బట్టలు లేకుండానే ..
రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్ పురాలో రైల్వే బ్రిడ్జి క్రింద మంగళవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. మృత దేహాన్ని చూసిన స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఆగపురా కు చెందిన మహిళ కిస్మత్ పురాకు ఆటోలో వచ్చిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కిస్మత్ పురాలో కల్లు కంపౌండ్ లో పూటుగా మద్యం సేవించినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. మహిళపై అత్యాచారం జరిగిన తర్వాత హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆమెను కల్లు కంపౌండ్ కు తీసుకెళ్లింది ఎవరు? హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
రైల్వే బ్రిడ్జి క్రింద పడి ఉన్న మహిళ మృత దేహన్ని తొలుత చూసిన వ్యక్తి కార్పోరేటర్ కు సమాచారం అందించాడు. కార్పోరేటర్ ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృత దేహం మీద బట్టలు లేవు. మహిళను కట్టెలతో చితక బాది హత్య చేసినట్టు తెలుస్తోంది. బాధిత మహిళ బట్టలు ఘటనా స్థలికి 200 మీటర్ల దూరంలో ఉన్నాయి.