వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజయవంతం కావాలి: గుజరాత్ సీఎం
x
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్

వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజయవంతం కావాలి: గుజరాత్ సీఎం


వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆకాంక్షించారు. "భారత ఆత్మ గ్రామాలలోనే ఉంది" అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారని, అది అక్షరాల సత్యమని అన్నారు. గ్రామీణులు నిజమైన దేశరక్షకులు, వారు పర్యావరణాన్ని రక్షించడంలో ఎప్పుడు ముందుంటారని చెప్పారు. " హస్తకళాకారుడు, చేనేత పరిశ్రమ ఎక్కువగా గ్రామాలలోనే ఉంటారు. ఇవి ఇప్పటికీ ఎక్కువగా సాంప్రదాయ, పర్యావరణ అనుకూల వాతావరణంలోనే నడుస్తున్నాయి. సహజ ఫైబర్ లు, రంగులతో సాంప్రదాయ పద్దతులతో సృష్టించబడిన ఉత్పత్తులు నిజంగా మన పర్యావరణాన్ని కాపాడతాయి" అని తన సందేశాన్ని వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వాహకులు వెంకన్ననేత గారికి ఆయన పంపించారు.




" చేనేత పరిశ్రమకు స్ఫూర్తిదాయకమైన భావజాలాన్ని ప్రొత్సహించడానికి వచ్చే నెల 18 (ఫిబ్రవరి)న ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ చేనేత కళాకారుల సదస్సు నిర్వహిస్తున్నారని విషయం తెలియగానే నాకు ఎంతో సంతోషానిచ్చింది. చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ది కోసం మీరు చూపిస్తున్న నిబద్ధత, స్థిరమైన అభిప్రాయాలు ఇక ముందు కొనసాగాలి. వరల్డ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరగాలని, శుభాకాంక్షలు అందిస్తున్నా" అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన సందేశంలో తెలియజేశారు.

Read More
Next Story