Fake Currency  | ఆర్థిక ఇబ్బందులతో అక్రమమార్గం పట్టిన యువ ఇంజినీర్
x

Fake Currency | ఆర్థిక ఇబ్బందులతో అక్రమమార్గం పట్టిన యువ ఇంజినీర్

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువ ఇంజినీర్ అక్రమ మార్గం పట్టిన ఉదంతం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో వెలుగుచూసింది. డిప్లొమా చేసి నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి తెర లేపాడు


మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లికి చెందిన యువ ఇంజినీర్ కార్లి నవీన్ కుమార్ (26) పహాడిషరీఫ్ ప్రాంతంలో నకిలీ నోట్ల రాకెట్ నిర్వహిస్తున్నాడని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఎల్బీనగర్, మహేశ్వరం జోన్ పోలీసులు నకిలీ నోట్ల రాకెట్ గుట్టును ఛేదించి, నిందితుడైన నవీన్ కుమార్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

- గ్రాఫిక్ డిజైన్, మల్టీమీడియా లో నైపుణ్యమున్న యువ ఇంజినీరు నకిలీ కరెన్సీ తయారీకి తెర లేపాడు.ఇంజినీరింగ్ డిప్లోమా చదవినా ఉద్యోగం దొర్క ఉబేర్, రాపిడో డ్రైవరుగా పనిచేసిన నవీన్ కుమార్ ఆర్థిక ఇబ్బందులతో నకిలీ నోట్ల తయారీ ఆరంబించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
- నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగించే కాగితాన్ని కోల్ కతాకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసి, ఆర్బీఐ థ్రెడ్ ఫైలు సాయంతో నిందితుడు నవీన్ కుమార్ నకిలీ నోట్లను ముద్రించాడు.

ప్రింటింగ్ మిషన్లు స్వాధీనం
నకిలీ నోట్లను ముద్రించిన నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి రూ.5లక్షల నకిలీ నోట్లు, ల్యాప్ టాప్, హెచ్ పీ కలర్ లేజర్ జెట్ ఫ్రో ప్రింటరు తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తుక్కుగూడలో నవీన్ కుమార్ రూ.500 నకిలీ నోట్లను చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తమ రాచకొండ పోలీసుల కృషితో నకిలీ నోట్ల రాకెట్ గుట్టు రట్టు అయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు చెప్పారు.

Read More
Next Story