పెళ్లి చేసుకుని మోసం చేసాడని యువతి ఆత్మహత్య
x

పెళ్లి చేసుకుని మోసం చేసాడని యువతి ఆత్మహత్య

వైజాగ్ యువతి సుసైడ్ నోట్ పోలీసులకు లభ్యం


ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో ఓ యువతి వైజాగ్ లో ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. వైజాగ్ తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన రమ్య (20) అదే గ్రామానికి చెందిన చినబొందయ్య కుమారుడు నరేష్ ప్రేమించుకన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావడంతో గొడవలయ్యాయి. పెళ్లి రద్దు చేసుకున్నారు. రమ్య హైదరాబాద్ లో ప్రయివేటు ఉద్యోగం చేస్తోంది. నరేష్ ఏడాది క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. హైదరాబాద్ లో ఉన్న రమ్యను నరేష్ మళ్లీ కాంటాక్ట్ అయ్యాడు. మాయమాటలు చెప్పాడు. నేను ప్రేమిస్తున్నాను అని బుకాయించాడు. పెళ్లి చేసుకుందామని చెప్పి హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్లాడు. వైజాగ్ లోని ఓ గుళ్లో రమ్యను పెళ్లి చేసుకున్నాడు.సెపరేటుగా కాపురం పెట్టాడు. ఇంతలో నరేష్ తండ్రి తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేష్ రమ్యదగ్గర ఉన్న డబ్బులు, నగలతో ఉడాయించాడు. రమ్యను వదిలించుకోవాలనే నరేష్ ఈ చర్యకు పాల్పడినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేయడంతో రమ్య తట్టుకోలేకపోయింది. తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు రమ్య సుసైడ్ నోట్ రాసింది.తన చావుకు తల్లిదండ్రులు కాదని నరేష్ అని ఆ నోట్ లో పేర్కొంది.రమ్య తండ్రి కొర్లపూడి బాసుకి రాసిన ఈ సుసైడ్ నోట్ పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకుని టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.‘‘నాన్న తమ్ముడిని బాగా చూసుకో, నన్ను మర్చిపోండి. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించావు. నీ లాంటి తండ్రి దొరకడు’’ అని రమ్య ఆ నోట్ లో పేర్కొంది. అంత్య క్రియల సందర్బంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read More
Next Story