జగన్ పై కసితీర్చుకుంటున్న షర్మిల
x
Revanth and YS Sharmila

జగన్ పై కసితీర్చుకుంటున్న షర్మిల

సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకున్న కసినంతా చెల్లెలు వైఎస్ షర్మిల తీర్చుకున్నారు.


సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకున్న కసినంతా చెల్లెలు వైఎస్ షర్మిల తీర్చుకుంటున్నారు. కాకపోతే తన కసిని డైరెక్టుగా కాకుండా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా తీర్చుకున్నారు. వైఎస్ 75వ జయంతిని షర్మిల మంగళగిరిలో భారీఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధి, సోనియాగాంధి, ప్రియాంకగాధి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పాటు చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ ఆహ్వానించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ వ్యతిరేకుందరినీ పేరు పేరునా షర్మిల ఆహ్వానించారు. జరిగిన వ్యవహారం చూసిన తర్వాత జగన్ వ్యతిరేకులందరినీ షర్మిల ఏకం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం అర్ధమైపొతోంది. గతంలో ఏరోజూ తండ్రి జయంతిని షర్మిల ఇంత ఘనంగా ఎప్పుడూ చేయలేదు. పార్టీలతో సంబంధంలేకుండా జయంతి, వర్ధంతులకు వారసులు ప్రముఖులందరినీ పిలవటం అందరికీ తెలిసిందే. కాని షర్మిల ఇపుడు మాత్రమే ఇంతమంది ప్రముఖులను పిలవటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే జగన్ తో ఏమాత్రం పడకపోవటమే. పైగా తాను ఇపుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అందుకనే ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు. అందుకనే కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రేవంత్, భట్టి తదితరులందరినీ పిలిచారు.

చంద్రబాబు, పవన్ హాజరుకాలేదు కాని రేవంత్, భట్టి లాంటి వాళ్ళు చాలామంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడినవారంతా వైఎస్ ను గొప్పగా పొగుడుతునే షర్మిల మాత్రమే నిజమైన వారసురాలిగా పదేపదే ప్రకటించారు. షర్మిలకు కావాల్సింది కూడా ఇదే. ఇప్పటివరకు వైఎస్ వారసుడు అంటే జగన్ మాత్రమే అన్నంతగా ఫోకసయ్యారు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో షర్మిల జోరుపెంచారు. అందుకనే తండ్రి వారుసులు అంటే జగన్ కాదు షర్మిల మాత్రమే అని రేవంత్ తదితరులతో బహిరంగంగా చెప్పించారు. తొందరలోనే కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీకి ఉపఎన్నికలు వస్తే తాను గల్లీగల్లీ తిరిగి కాంగ్రెస్ కు ప్రచారం చేస్తానని రేవంత్ ప్రకటించారు. వైఎస్ వారసులను గెలిపించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తానని రేవంత్ ప్రకటించటం ఇందులో భాగమే. షర్మిలకు కావాల్సింది కూడా ఇదే.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ రేవంత్ ను జగన్ పెద్దగా గుర్తించలేదన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే రేవంత్ కాంగ్రెస్ మనిషి పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అందుకనే రేవంత్ సీఎం అవ్వగానే శుభాకాంక్షలు చెప్పి ఊరుకున్నారు. ఈ విషయం కూడా రేవంత్ కు బాగా మండినట్లుంది. అందుకనే ఇపుడు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు. వైఎస్ కు రాజకీయంగా నిజమైన వారసురాలు షర్మిల మాత్రమే అని ప్రకటించారు. అలాగే వైఎస్ కు బాగా సన్నిహితులుగా, కోటరి అనిపించుకున్న కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి, రఘువీరారెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలను చాలామందిని జగన్ దూరంపెట్టారు. అలాంటి వాళ్ళలో ఉండవల్లి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్, టీడీపీలో ఉన్నారు. వాళ్ళని కూడా షర్మిల ఏరికోరి కార్యక్రమానికి ఆహ్వానించి తనకు మద్దతుగా మాట్లాడించారు.

మొత్తంమీద కార్యక్రమానికి హాజరైనవారంతా వైఎస్ ను షర్మిల గురించి గొప్పగా మాట్లాడి జగన్ను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇదే సమయంలో జగన్ వైపు నుండి తండ్రి జయంతి ఉత్సవాలు జరగలేదు. ఓటమితాలూకు అవమానం లేదా బాధ జగన్ను ఇంకా వదల్లేదు. ఈ విషయాన్ని షర్మిల బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. జగన్ గురించి తాను ఒక్కమాట కూడా డైరక్టుగా మాట్లాడకుండానే కార్యక్రమానికి వచ్చిన వారితో తానే అసలైన వారసురాలిగా షర్మిల గొప్పగా చెప్పించుకున్నారు. ఇపుడే ఇలాగుంటే రేపు పులివెందుల ఎంఎల్ఏగా జగన్ రాజీనామాచేయబోతున్నారని జరుగుతున్న ప్రచారం నిజమైతే అప్పుడు షర్మిల ఇంకెలా రెచ్చిపోతారో చూడాలి.

Read More
Next Story