తెలంగాణా అభివృద్ధిలో వైఎస్సార్ ముద్ర ఇంత బలంగా ఉందా ?
x
YSR

తెలంగాణా అభివృద్ధిలో వైఎస్సార్ ముద్ర ఇంత బలంగా ఉందా ?

కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ పేరును పదేపదే ప్రస్తావించేవారు.


తెలంగాణా అసెంబ్లీలో ఏదో రూపంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జపం జరుగుతునే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అసెంబ్లీ సమావేశాల్లోనే కాదు బహిరంగసభలు, పార్టీ మీటింగుల్లో కూడా వైఎస్సార్ ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ నేతలంటే వైఎస్సార్ ప్రస్తావనను తెస్తున్నారు సరే కేసీఆర్ కూడా సందర్భం వచ్చినపుడల్లా దివంగత ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చేవారు. విచిత్రం ఏమిటంటే కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ పేరును పదేపదే ప్రస్తావించేవారు.

ఇపుడు విషయం ఏమిటంటే సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ ప్రస్తావనను ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ తెచ్చారు. వైఎస్సా వల్లే తమకు నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చిందన్నారు. రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైఎస్సార్ తమకు పూర్తి న్యాయం చేసినట్లు చెప్పారు. రిజర్వేషన్లు కల్పించటం ద్వారా ముస్లింల మనసుల్లో వైఎస్సార్ చిరస్ధాయిగా నిలిచిపోయినట్లు చెప్పారు. ఉన్నత చదువులు, స్కాలర్ షిప్పులు, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంలో కూడా వైఎస్సార్ వల్లే ఎంతోమంది ముస్లిం విద్యార్ధులకు మేలు జరిగిందన్నారు.

అక్బరుద్దీన్ విషయాన్న పక్కనపెట్టేస్తే రేవంత్ రెడ్డ కూడా పదేపదే వైఎస్సార్ ప్రస్తావన తెస్తునే ఉన్నారు. హైదరాబాద్ ఈ స్ధాయిలో డెవలప్ అయ్యిందంటే అందుకు వైఎస్సారే కారణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు, శంషాబాద్ విమానాశ్రయం లేకపోతే హైదరాబాద్ ఈ స్ధాయిలో డెవలప్ అయ్యేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన ప్రతిసారి రేవంత్ తప్పనిసరిగా వైఎస్సార్ పేరును జోడిస్తుండటం అందరికీ తెలిసిందే. ఇక అధికారంలో ఉన్నపుడు కేసీయార్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు దివంగత ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్ మెంటు, ఆరోగ్యశ్రీ పథకం, శంషాబాద్ విమానాశ్రయం అభివృద్ధి విషయంలో చాలాసార్లు వైఎస్సార్ కృషిని కేసీయార్ ప్రశంసించారు.

ఇక ఏపీ విషయానికి వస్తే వారసుడు కాబట్టి జగన్ దివంగత ముఖ్యమంత్రి గురించి గొప్పగా చెప్పుకోవటంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే జగన్ను శాడిస్టని, విధ్వసకారుడని చెప్పటానికి చంద్రబాబునాయుడు అప్పుడప్పుడు వైఎస్సార్ గురించి ప్రస్తావిస్తున్నారంతే. అదికూడా తానుచేసిన అభివృద్ధిని కంటిన్యు చేశారని చెప్పటానికి మాత్రమే వైఎస్సార్ పేరును ప్రస్తావిస్తున్నారు. అంతేకాని వైఎస్సార్ హయాంలో జరిగిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో ప్రాజెక్టు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ గురించి పొరబాటున కూడా చెప్పటంలేదు. పైగా వీటిని తన ఖాతాలో వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో, దివంగత ముఖ్యమంత్రి వెళిపోయి 15 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా తెలంగాణా అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా అన్నీ పార్టీలు వైఎస్సార్ జపం చేస్తునే ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.

YSR

Read More
Next Story