
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
కాల్పుల విరమణ ఉల్లంఘనపై హిందీ కవితను ప్రస్తావించిన థరూర్
వారి మాట ఎలా నమ్మగలమని ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మూడు గంటల్లోనే మరోసారి దాయాదీ దానవ దేశం డ్రోన్లు ప్రయోగించి, కాల్పులు జరపడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటలను ఎలా నమ్మాలి అంటూ ఓ ప్రసిద్ద హిందీ కవితను ప్రస్తావించారు.
పహల్గాం ఉగ్రవాద ఘటనపై భారత్ ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దీనితో రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇది కొనసాగుతున్న తరుణంలోనే రెండు దేశాల మధ్య శనివారం ఆకస్మాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
పాక్ జీడీఎంఓ ఈ ప్రతిపాదన తేవడంతో భారత్ సైతం అంగీకరించింది. విదేశాంగ కార్యదర్శి సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ పై అధికారికంగా వివరాలు అందించారు.
ఆయన ప్రకటించడానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం ట్వీట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ చర్చల తరువాత భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ ట్వీట్ లో పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరువాత ఇది సడన్ గా జరిగింది. ఇరుపక్షాలు తీవ్రమైన దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. ఇలా నాలుగు రోజులు తరువాత హఠాత్తుగా కాల్పులు విరమణ అమల్లోకి వచ్చింది. అయితే మూడు గంటల్లోనే పాకిస్తాన్ మరోసారి దాడులకు పాల్పడింది.
థరూర్ ఏమన్నారంటే..
ఈ పరిస్థితికి ప్రతిస్పందిస్తూ హ్యాష్ ట్యాగ్ సీజ్ ఫైర్ వాయిలేటేడ్ ఉపయోగించారు. ‘‘ఉస్కీ ఫిత్రాత్ హై ముఖర్ జానే కీ, ఉస్కే వాదే పె యాకీన్ కైసే కరు’’ అనే హిందీ కవితను ఉటంకించారు. ( వారి మాటను వెనక్కి తీసుకోవడం, వారి స్వభావం, నేను వారి వాగ్ధానాలను ఎలా నమ్మగలం) భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై శాంతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
భారత్ దీర్ఘకాలిక యుద్ధం కోరుకోలేదని, కానీ ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పించాలనుకుంది. ఒక కార్యక్రమంగా పాఠం నేర్పించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఘోరమైన దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జేకే లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావించారు.
ఆ ఆపరేషన్ పేరు చాలా అద్భుతంగా ఉందని థరూర్ ప్రశంసించారు. భార్యల ముందే భర్తలను కాల్చి చంపడం అందరి మదిని తొలిచివేసిందని అన్నారు.
అవగాహన ఉల్లంఘన..
కాల్పుల విరమణ ఉల్లంఘనపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రమైన అవగాహన ఉల్లంఘనగా అభివర్ణించారు. పాకిస్తాన్ పాల్పడుతున్న ఉల్లంఘనలకు భారత సాయుధ దళాలు ప్రతిస్పందిస్తున్నాయని అన్నారు.
రాత్రి 11.20 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని గంటల్లో భారత్ - పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ ల జనరల్ మధ్య కుదిరిన అవగాహానను పదేపదే ఉల్లంఘించారని ఆరోపించారు.
‘‘ఇది ఒప్పందాలను ఉల్లంఘించడమే. ఈ ఉల్లంఘనలకు సాయుధ దళాలు తగిన, సముచిత ప్రతిస్పందనలు ఇస్తున్నాయి. ఈ ఉల్లంఘనలు మేము చాలా తీవ్రంగా తీసుకుంటాము’’ అని ఆయన అన్నారు.
ఈ అంశంపై సాయుధ దళాలు గట్టిగా నిఘా ఉంచాయన్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలు జరిగితే వాటిని గట్టిగా ఎదుర్కోవాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు.
అంతకుముందు సాయంత్రం విదేశాంగ శాఖ అధికారికంగా కాల్పుల విరమణ ప్రతిపాదనను తెలియజేసింది. సముద్రం, వాయు, భూతలంపై కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని, సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మే 12న మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుగుతాయని అన్నారు.
Next Story