ఆ లైంగికదాడి నిందితుడు.. మా పార్టీ సానుభూతిపరుడే : స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీలో స్వయంగా ప్రకటించిన సీఎం
గత కొన్ని రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నాయూనివర్శిటీ లైంగిక వేధింపుల నిందితుడు అధికార డీఎంకే పార్టీ సానుభూతిపరుడని తేలింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నారు.
నిందితుడు మా పార్టీ సానుభూతిపరుడు మాత్రమే అని, సభ్యుడు కాదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికి నిందితుడికి అధికార పార్టీతో సంబంధం అంటగట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
లైంగిక దాడి..
అన్నా యూనివర్శిటీకి చెందిన 19 ఏళ్ల విద్యార్థిని తన స్నేహితులతో ఉన్న సందర్భంలో కాలేజ్ క్యాంపస్ లో లైంగిక దాడికి గురైంది. ఈ సంఘటన గత ఏడాది డిసెంబర్ 23 న రాత్రి చోటు చేసుకుంది. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది.
నిందితుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని, అందుకే కేసును తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వచ్చాయి. వివాదం రోజు రోజుకు పెద్దది అవుతుండటంతో స్వయంగా సీఎం అసెంబ్లీలో దీనిపై వివరణ ఇచ్చారు.
విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం బాధితురాలికి న్యాయం చేయడం మాత్రమే అని, దానిపై మేము దృష్టి పెట్టినట్లు వివరించారు.
‘‘ సభ్యులందరూ దీనిపై మాట్లాడారు.. ఒక్కరు తప్ప అందరూ నిజమైన అంశం తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ వారు మాత్రం దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నారు’’ సీఎం ఆక్షేపించారు.
ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం..
లైంగిక వేధింపులపై విమర్శలు రావడంతో స్వయంగా సీఎం స్వయంగా వివరణ ఇచ్చారు. ‘‘ ప్రభుత్వ లక్ష్యం కేవలం బాధితురాలికి న్యాయం చేయడమని ’’ సీఎం పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
నిందితుడిని అరెస్ట్ చేశామని, తాము బాధితుల పక్షానే ఉన్నామని సమర్థించుకున్నారు. ‘‘ సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశాం. ఆధారాలు సేకరించాము,కేవలం రాజకీయ లక్ష్యాలు సాధించడం కోసమే మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
విపక్షాల ప్రశ్నలు..
స్టాలిన్ ఇచ్చిన వివరణపై ప్రతిపక్షం కూడా తమ విమర్శలకు పదును పెట్టింది. నిజంగా మీరు నిందితుడిని అరెస్ట్ చేసి ఉంటే అతడి పేరు బయట పెట్టాలని డిమాండ్ చేసింది. అలాగే ఆధారాలు ఉంటే సిట్ సమర్పించాలని డిమాండ్ చేసింది.
ఈ కేసును తప్పించుకోవడానికి ఛీప్, షార్ట్ టర్మ్ పొలిటికల్ రాజకీయాలు ఆపాలని చురకలు అంటించింది. మొదట ప్రభుత్వం నిందితుడి పక్షాన నిలబడిందని, బాధితురాలికి న్యాయం చేయలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలను సేఫ్ గా లేరని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని అన్నారు.
Next Story