
కోలీవుడ్ సూపర్ స్టార్, హీరో విజయ్
రెండోసారి హీరో ‘విజయ్’ ను విచారిస్తున్న సీబీఐ
తొలిరౌండ్ లో బాధ్యతారాహిత్య సమాధానాలు ఇచ్చిన దళపతి?
కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ హీరో విజయ్ ను విచారిస్తోంది. ఆయన సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. వారం క్రితం ఒకసారి సీబీఐ విచారణకు హజరైన విజయ్, సంక్రాంతి తరువాత మరోసారి ఢిల్లీకి వచ్చారు. నేటీ ఉదయం లోధి రోడ్ లోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి ఆయన లగ్జరీ ఎస్యూవీ కార్ల కాన్వాయ్ లో విచారణకు హజరయ్యారు.
సంక్రాంతి తరువాత విచారణ..
డిప్యూటీ సూపరిండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని అధికారుల బృందం విజయ్ ను ప్రశ్నిస్తోంది. జనవరి 12న తొలిసారి సీబీఐ దాదాపు ఆరుగంటల పాటు విజయ్ విచారించింది. తరువాత రోజు కూడా విచారణకు రావాలని కోరగా తమిళనాడులో సంక్రాంతి పెద్ద పండగ నేపథ్యంలో మరొక తేదీని కావాలని ఆయన అభ్యర్థించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 27, 2025 న జరిగిన కరూర్ తొక్కిసలాట కేసు తమిళనాడు పోలీసుల నుంచి సీబీఐ తన ఫరిదిలోకి తీసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది చనిపోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు.
బాధ్యతారాహిత్యమైన సమాధానాలు..
మొదటిసారి సీబీఐ విచారణకు హజరైన విజయ్ బాధ్యతారాహిత్యమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ర్యాలీలో తొక్కిసలాటకు తాను కారణం కాదని, తాను కేవలం వక్తగా మాత్రమే ఉన్నానని పేర్కొన్నాడు. ర్యాలీని నిర్వహించడానికి పోలీసుల సాయం కోరానని, గందరగోళం నెలకొనకుండా తాను ముందే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు.
దర్యాప్తు అధికారులు విజయ్ కరూర్ సంఘటన రోజు జరిగిన విషయాలను పరిశీలిస్తున్నారు. ఆ రోజు విజయ్ దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా కరూర్ చేరుకున్నారు. ప్రసంగం జరుగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలు సాయం కోసం అరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
కారణం ఏంటీ?
ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎందుకు దుర్ఘటన జరిగిందనే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. జనసమూహం నియంత్రణ, కచ్చితమైన ప్రణాళిక అమలు చేశారా? తాగునీరు, బారికేడ్లు, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలను నిశితంగా పరిశీలిస్తోంది.
మీడియా నివేదికల ప్రకారం.. విజయ్ వాంగ్మూలాలను అతని డ్రైవర్, పోలీస్ రికార్డులతో పోల్చి చూస్తోంది. ఇక్కడ కేవలం 5 వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా 25 వేల మంది ఎలా వచ్చారని కారణం ఏంటనీ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
Next Story

