మాకేదో అనుమానంగా ఉంది, సీబీఐ విచారణ జరిపించండి
x

మాకేదో అనుమానంగా ఉంది, సీబీఐ విచారణ జరిపించండి

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 60 మంది మృతి చెందిన ఘటనలో సీబీఐ తో విచారణ జరిపించాలని గవర్నర్ రవిని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోరారు.


కల్తీ సారాతో 60 మంది మృతికి కారణమైన కళ్లకురిచి హూచ్ దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె అన్నామలై నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలిశారు.

ఈ విషాదం కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నామలై సామాజిక మాధ్యమం ఎక్స్ పేర్కొన్నారు. దీనికి 'బాధ్యత వహిస్తూ ప్రొహిబిషన్, ఎక్సైజ్ మంత్రి ఎస్ ముత్తుసామిని వెంటనే తన క్యాబినేట్ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆదేశించాలని గవర్నర్ రవిని కోరామన్నారు.
గత మూడేళ్లలో గంజాయి, మాదక ద్రవ్యాల లభ్యత పెరిగిన విషయాన్ని అధికార డీఎంకే అంతగా పట్టించుకోవడం లేదని, ఇది అనుమానాలకు దారి తీస్తోందని అన్నామలై ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కళ్లకురిచ్చిలో 60 మంది ప్రాణాలు గాలిలో కలిశాయని విమర్శించారు. దీనిపై గవర్నర్ కలిసి, దీనిపై విచారణ జరపాలని కోరామని అన్నామలై అన్నారు. "ఇంత మంది ప్రాణాలు కోల్పోయినా" సిఎం, ఎక్సైజ్ మినిష్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలలో అనేక ప్రశ్నలకు దారితీసిందని ఆయన అన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రిని తొలగించాలని ముఖ్యమంత్రికి పట్టుబట్టాలని గవర్నర్‌ను అభ్యర్థించామని అన్నామలై తెలిపారు. ఆయనతో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తదితరులు ఉన్నారు.


Read More
Next Story