కేరళ మృతులు 166, పెరుగుతున్న సంఖ్య
x

కేరళ మృతులు 166, పెరుగుతున్న సంఖ్య

కేరళలోని భారీ వర్షాల కారణంగా వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాలలో రెండో రోజు సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.


కేరళలోని భారీ వర్షాల కారణంగా వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాలలో రెండో రోజు సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బుధవారం (జూలై 31) ఉదయం 10.15 గంటల వరకు 166 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు 123 శవాలకు పోస్టు మార్టం నిర్వహించి తమ కుటుంబసభ్యులకు అప్పగించారు. సహాయక సిబ్బంది మరో 75 మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్మీ, నేవీ, NDRF బృందాలు ప్రాణాలతో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా వాయనాడ్ జిల్లాలోని మెప్పాడిలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామస్థుల ఇళ్లపై కొండచరియలు వచ్చి పడ్డాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను గుర్తింపు, శవపరీక్ష నిమిత్తం వివిధ ఆసుపత్రి మార్చురీలకు తరలిస్తున్నారు.

చిక్కుకుపోయిన వ్యక్తులను వేగంగా తరలించేందుకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూలూర్ నుంచి రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.

Read More
Next Story