కాంగ్రెస్, డీఎంకే చరిత్ర మొత్తం అవినీతిమయమే: ప్రధాని మోదీ
డీఎంకే చరిత్ర మొత్తం కుంభకోణాలమయమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహిళలను అవమానించడం ఆ పార్టీ నిజస్వరూపమని ఘూటు వ్యాఖ్యలు చేశారు. దేశానికి డీఎంకే శత్రువు ..
జమ్మూకాశ్మీర్ ను దేశం నుంచి విడదీయాలనే వారికిన అక్కడి ప్రజలు తిరస్కరించారని, అలాగే తమిళనాడులో కూడా జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.
కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రజలను "దోపిడీ" చేసేందుకు డిఎంకె, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయని విమర్శించారు. 2జీ కుంభకోణంలో డీఎంకే నే అతిపెద్ద లబ్దిదారుడిగా నిలిచిందని ఆ పార్టీ నేతలు కుంభకోణాలకు పాల్పడి జైళ్లకు వెళ్లిన సంగతి ఈసందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.
మాకు చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు ఉన్నాయని, ప్రతిపక్ష ఇండి కూటమి స్కామ్ లతో నిండి ఉన్నాయని విమర్శించారు. ఆ స్కామ్ ల జాబితా పొడవు చూస్తే ప్రపంచం ఆశ్చర్యపోతుందని వ్యాఖ్యానించారు.
డీఎంకే పై నిప్పులు చెరిగిన మోదీ
తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీకి దేశం అన్నా, మన సంస్కృతి అన్న విపరీతమైన ద్వేషం ఉందని విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడు భవిష్యత్తు, సంస్కృతికి ద్రవిడ పార్టీ డీఎంకే ప్రధాన శత్రువు అని ఆరోపించారు. డీఎంకే, కాంగ్రెస్‌లు మహిళా వ్యతిరేకి అని, అవి కేవలం మహిళలను మోసం చేసి అవమానించాయని, వాటి చరిత్ర మొత్తం అవే ఉన్నాయని ఆరోపించారు.
తమిళనాడు ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పట్ల మృదువుగా వ్యవహరిస్తూ, దివంగత ముఖ్యమంత్రి జె జయలలితతో ఎలా వ్యవహరిస్తుందో ప్రజలకు తెలుసని, అలాంటి సంస్కృతి నేటికీ కొనసాగుతోందని, రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు.
ఇటీవలి అయోధ్య ఆలయ సంఘటన ప్రసారాన్ని రాష్ట్రం అనధికారికంగా నిషేధించిదని ప్రధాని మరోసారి ఆరోపించారు. కన్యాకుమారీ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
Next Story