తమిళనాడు అసెంబ్లీ నుంచి మరోసారి వెళ్లిపోయిన గవర్నర్
x
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి

తమిళనాడు అసెంబ్లీ నుంచి మరోసారి వెళ్లిపోయిన గవర్నర్

మేకకు గడ్డం అక్కర్లేదు.. రాష్ట్రాలకు గవర్నర్ అక్కర్లేదన్న సీఎం స్టాలిన్, జాతీయ గీతాన్ని డీఎంకే పదే పదే అవమానిస్తుందన్న లోక్ భవన్


తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరోసారి వివాదం తలెత్తింది. తమిళనాడు అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా ఆర్ఎన్ రవి సభను ఉద్దేశించి సంప్రదాయకంగా చేయాల్సిన ప్రసంగం చేయకుండా వెళ్లిపోయారు. ‘జాతీయ గీతాన్ని’ తమిళనాడు అసెంబ్లీ అగౌరవపరిచిందని, ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంతో తీవ్ర విభేదాలు ఉన్నాయని ఆరోపించారు.

సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర గీతమైన ‘తమిళ్ తాయ్ వాఝ ఆలపన’ తో సెషన్ ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం కోసం అనేకమంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ప్రారంభంలో జాతీయ గీతం పాడలేదని రవి ఆరోపించారు.
సభా కార్యక్రమాల్లో ‘తమిళ్ తాయ్ వాఝా’ స్థానంలో ఆయన జాతీయ గీతం పాడాలని పట్టుబట్టారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రసంగంలోని ఏ భాగాన్ని ఆయన చదవకుండానే ఆయన సభ నుంచి బయటకు వెళ్లడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తదనంతరం, విధానపరమైన నిబంధనలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగాన్ని చదివినట్లు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అన్నాదురై మాటలు..
తీర్మానం తరువాత సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ రవి చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. దివంగత డీఎంకే పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై మాటలను ప్రస్తావించాడు. ‘‘ మేకకు గడ్డం అవసరం లేదు. రాష్ట్రానికి గవర్నర్ అవసరం లేదు. ఈ మాటలు మరోసారి నిజం అవుతున్నాయి’’ అని విమర్శలు చేశారు.
ఆయన వాకౌట్ శాసన నియమాలను, దీర్ఘకాల పార్లమెంటరీ సంప్రదాయాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఖండించారు. దీనిని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని అని తెలిపారు.
ఈ సంఘటన వరుసగా మూడో సంవత్సరం ఇటువంటి ఘర్షణలను సూచిస్తుంది. 2024-25 లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. కంటెంట్ అభ్యంతరాల కారణంగా రవి తన ప్రసంగాలను సంక్షిప్తీకరించాడు.
లోక్ భవన్(ఒకప్పుడు రాజ్ భవన్) నుంచి పత్రికాప్రకటన విడుదల చేశారు. పదే పదే మైక్రో ఫోన్ అభ్యంతరాలు, అసలు అనేక ఆధారాలు లేని వాదనలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని, కీలకమైన ప్రజా సమస్యలను పక్కనపెడుతున్నారని ఆరోపించారు.
లోక్ భవన్ చెప్పిన కారణాలు..?
మైక్ ఆపివేశారు: గవర్నర్ మైక్రో ఫోన్ పదే పదే ఆపివేశారు. ఆయన మాట్లాడుతుంటే ఇబ్బందులు పెట్టారు. ప్రసంగంలో ఆధారాలు లేని వాటిని చేర్చారు.
పెట్టుబడి వాదనలు: రూ. 12 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామనే కల్పిత వాదనలు ఇచ్చారు. అనేక అవగాహాన ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. తమిళనాడు ఎఫ్డీఐ ర్యాంకింగ్ జాతీయ స్థాయిలో నాల్గు నుంచి ఆరుకు పడిపోయింది.
మహిళల భద్రత: ఫోక్సో అత్యాచార కేసులలో 55 శాతం పెరిగింది. లైంగిక వేధింపుల ఘటనలు 33 శాతం పెరిగాయి.
మాదక ద్రవ్యాల సంక్షోభం: ఒక సంవత్సరంలో 2 వేల కంటే ఎక్కువమంది యువత ఆత్మహత్యకు కారణం మాదక ద్రవ్యాల దుర్వినియోగం. వీటిని అరికట్టలేదు.
దళితులపై దాడులు: దళిత మహిళలపై లైంగిక దాడులతో సహ పెరుగుతున్న హింస గురించి ప్రస్తావించలేదు.
ఆత్మహత్య మహామ్మారి: సంవత్సరానికి దాదాపు 20 వేల ఆత్మహత్యలు. రోజువారిగా సగటు 65, భారత్ లో ఆత్మహత్యల రాజధానిగా తమిళనాడు కు అవమానకరమైన గుర్తింపు.
విద్యా సమస్యలు: క్షీణిస్తున్న ప్రమాణాలు 50 శాతానికి పైగా అధ్యాపక ఖాళీలు, యువత భవిష్యత్ ను బెదిరించే సంస్థాగత దుర్వినియోగం పెరగడం.
పంచాయతీలు పనిచేయకపోవడం: ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో వేలాది గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. లక్షలాది మందికి అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని అందించకుండా రాజ్యాంగ లక్ష్యాలను నీరుగారుస్తున్నారు.
ఆలయ పరిపాలన ధ్వంసం: వేలాది దేవాలయాలకు ట్రస్టీలు లేరు. ఐదు సంవత్సరాల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడం, నిర్వహణ లోపం కారణంగా భక్తులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఎంఎస్ఎంఈ సంక్షోభం: అధిక నిర్వహణ ఖర్చులు, వ్యవస్థాపకులు దూరం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో 55 మిలియన్ల ఎంఎస్ఎంఈలకు గాను తమిళనాడు కేవలం 4 మిలియన్ల ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఆతిథ్యం ఇస్తోంది.
ఉద్యోగుల ఫిర్యాదులు: అన్ని రంగాలలో దిగువ స్థాయి కార్మికులలో విస్తృతంగా వ్యాపించిన అసంతృప్తి అలాగే ఉంది.
జాతీయ గీతాన్ని అవమానించడం: ఈ ప్రాథమిక రాజ్యాంగ విధి పట్ల పదేపదే నిర్లక్ష్యం చేయడం
గవర్నర్ ప్రసంగ సంప్రదాయాన్ని తొలగించడానికి రాజ్యాంగ సవరణల కోసం సారూప్యత కలిగిన జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని తన పార్టీ ఉద్దేశ్యాన్ని స్టాలిన్ మరోసారి వెల్లడించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 21న గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమించింది. ఆయన సమాఖ్య సమస్యలు, సాంస్కృతిక చిహ్నాలు, విధాన జాప్యాల కారణంగా డీఎంకే ప్రభుత్వంతో విభేదిస్తున్నారు.
గతంలో బిల్లు ఆమోదానికి సంబంధించిన ప్రతిష్టంభనలు ఉన్నాయి. దీని ఫలితంగా 2023 లో సుప్రీంకోర్టు నుంచి మందలింపులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఇరుపక్షాల మధ్య వివాదం తలెత్తింది.
Read More
Next Story