
తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి దీపం
తిరుపరంకుండ్రం దీపం వివాదం: స్టే ఇచ్చేందుకు నిరాకరించిన మధురై బెంచ్
కోర్టు ధిక్కార పిటిషన్ ను విచారిస్తున్న సింగిల్ జడ్జీ
మహాలింగం పొన్నుస్వామి
తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం(దీపథూన్) వద్ద కార్తీక దీపం వెలిగించడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ లో సింగిల్ జడ్జీ ముందు విచారణను నిలిపివేయడానికి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మంగళవారం నిరాకరించింది.
వివాదాస్పద స్తంభం వద్ద సనాతన క్రియలకు అనుసరిస్తూ డిసెంబర్ 1న జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లను విచారించిన జస్టిస్ జి. జయచంద్రన్, కేకే రామకృష్ణన్ లతో కూడిన డివిజన్ బెంచ్, సింగల్ జడ్జీ ధిక్కార విచారణను నిలిపివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
సికందర్ బాదుషా దర్గా సమీపంలో పురాతన స్తంభం వద్ద దీపం వెలగించాలని సింగిల్ జడ్జీ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఆలయ ఆస్తి అని, దీపం వెలిగించడం సనాతన సంప్రదాయంలో భాగమని పేర్కొన్నారు.
తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో తాజా విచారణలో హిందూ పిటిషనర్లు సంప్రదాయ దీపథూన్ గా పేర్కొన్న కొండపై రాతి స్తంభం వద్ద ఆచారాన్ని అనుమతించడంపై అప్పీళ్లు దాఖలైయ్యాయి.
నిర్మాణం..ఎలాంటిది..
ఆలయం, రాష్ట్రం, దర్గా, వక్ఫ్ వైపుల నుంచి వాదనలను విచారిస్తూ నిర్మాణం స్వభావాన్ని ప్రశ్నించిన డివిజన్ బెంచ్, కోర్టు ధిక్కార చర్యలపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ ఆర్ అండ్ సీఈ విభాగం దర్గా నిర్వహణతో సహ అప్పీల్ దారులు ఈ స్తంభం దీపథూన్ కాదని, జైనకాలం నాటి నిర్మాణం లేదా సర్వే రాయి అని వాదనలు వినిపించాయి.
ఒక శతాబ్ధానికి పైగా అక్కడ కార్తీక దీపం వెలిగించినట్లు చారిత్రక ఆధారాలు లేవంది. పండగ సమయంలో పోలీసుల జోక్యం శాంతిని కాపాడిందని, సింగిల్ జడ్జీ ఆ స్థలం వక్ఫ్ ఆస్తి అని సూచించే భూమి రికార్డులను పట్టించుకోలేదని,ఈ తీర్పు మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని వారు వాదించారు.
‘‘దీపం వెలిగించడానికి స్థలం వక్ఫ్ పరిధిలోని దర్గాకు చెందినభూమిలో ఉంది. దర్గా మార్గం ద్వారా దానిని యాక్సెస్ చేయడం ద్వారా వారి సమాజానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది’’ అని వక్ఫ్, దర్గా పక్షాల న్యాయవాదీ వాదించారు.
1994 నాటి ఉత్తర్వూ ప్రకారం.. కొండపై ఉన్న ఆచారాలపై నిర్ణయం తీసుకోవడానికి ఆలయ దేవస్థానానికి అధికారం ఉందని, యాజమాన్యం వంటి పౌర హక్కుల సమస్యలకు రిట్ అధికార పరిధి కాదు, సివిల్ కోర్టు నిర్ణయం తీసుకోవాలని వాదించారు.
సత్యం ఏమిటంటే..
హిందూ పక్షానికి చెందిన న్యాయవాదులు వాదిస్తూ.. కొండ మొత్తం మురుగన్ ఆలయానికి చెందినదని, ఈ స్తంభం ఆలయ భూమిలో పురాతన సంస్కృతిలో ఆచారంలో భాగంగా ఉందని వాదించారు.
‘‘శిఖరం వద్ద దీపం వెలగించడం మన సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది’’ అని న్యాయవాదీ కొన్ని వివరాలు సమర్పించారు. ఒక వర్గం దీనిని సర్వే రాయి అని మరోక వర్గం దీనిని జైన స్తంభం అని పిలుస్తుంది. నిజం ఏమిటీ? దీన్ని ఎవరూ నిర్మించారు.? అని బెంచ్ ఘాటైన ప్రశ్నలు సంధించింది.
ధిక్కార కేసులో చీఫ్ సెక్రటరీ, అడిషనల్ డీజీపీని వ్యక్తిగత హజరు నుంచి మినహయించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ.. సింగిల్ జడ్జీని సంప్రదించండి.. మేము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది.
స్తంభం గుర్తింపు, చారిత్రక ఉపయోగంపై ఆధారాలు అవసరమని కోర్టు తెలుపుతూ విచారణ వాయిదా వేసింది. కొండపై ఉన్న స్తంభం వద్ద లైటింగ్ ను పునరుద్దరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల నుంచి ఈ కేసు వచ్చింది.
జస్టిస్ స్వామినాథన్ దీనిని అనుమతించారు. ఇది సుబ్రమణ్య స్వామి ఆలయం, సికందర్ బాదుషా దర్గాను నిర్మించారు. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Next Story

