ఆ రెండు పార్టీలు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయి: ప్రధాని మోదీ
x
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఆ రెండు పార్టీలు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయి: ప్రధాని మోదీ

కాంగ్రెస్, డీఎంకే రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తే దేశాన్ని అంధకారంలోకి నెట్టాయని ప్రధాని మోదీ ఆరోపించారు.


ప్రతిపక్ష కాంగ్రెస్, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశాన్ని దశాబ్దాల పాటు ఈ రెండు పార్టీలు అజ్ఞానంలో ఉంచాయని మండిపడ్డారు. మహిళలను అవమానించడం ఆ పార్టీ సంస్కృతి అంటూ దుమ్మెత్తి పోశారు. తమిళనాడులో అధికారంలో ఉన్న ఓ పార్టీకి అవినీతి విషయంలో ఫ్యామిలి పేటెంట్ రైట్ ఉందని పరోక్షంగా డీఎంకే ను ఉద్దేశించి విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అందరూ దోచుకునే విషయంలో ఆరితేరారని ఆరోపించారు. వారికి మొదటి కుటుంబం తరువాత ప్రజలని చురకలంటించారు.

ఏప్రిల్ 19న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థులకు ఓట్లు వేయాలని వేలూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని అభ్యర్థించారు. ఈ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ "డిఎంకె అవినీతిపై మొదటి కాపీరైట్ కలిగి ఉంది, కుటుంబం మొత్తం తమిళనాడును లూటీ చేస్తోంది" అని అన్నారు. డీఎంకే 'కుటుంబ సంస్థ' అని మోదీ ఆరోపించారు. దాని "పాత మనస్తత్వం"తో రాష్ట్ర యువత పురోగతిని అడ్డుకుంటున్నదని ఆయన ఆరోపించారు.
"DMK ప్రజలను భాష, ప్రాంతం, విశ్వాసం, కులాల వారీగా విభజించింది. అందరూ సమానంగా ఉంటే డీఎంకే కు ఒక్క ఓటు కూడా రాదని తెలుసు. అందుకే విభజన రాజకీయాలకు తెరతీసింది. డిఎంకె దశాబ్దాల నాటి ప్రమాదకరమైన రాజకీయాలను బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నాను" అని మోదీ అన్నారు. ద్రవిడల గుండెల్లో గణనీయ స్థాయిలో దూసుకుపోవడానికి బీజేపీ ఉత్సాహంగా పోరాడుతోందని అన్నారు.
1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించినప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, డీఎంకేలను మరోసారి టార్గెట్‌ చేస్తూ, ఏ క్యాబినెట్‌ సమావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగారు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి. వీటికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పలేదు.
కచ్చతీవును విడిచిపెట్టిన తరువాత, తమిళనాడు నుంచి మత్స్యకారులను అరెస్టు చేశారు, వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. "కాంగ్రెస్- డిఎంకె వారిపై కనికరం డ్రామాలు ఆడాయి" అని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడు మత్స్యకారుల విషయంలో శాశ్వత పరిష్కారానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే లంకలో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న ఐదుగురు జాలర్లను ఎన్డీఏ ప్రభుత్వం రక్షించిదన్నారు.
రాహుల్ గాంధీపై..
శక్తిని నాశనం చేస్తానన్నా కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. డీఎంకే మనస్తత్వం కూడా ఇదేననీ అన్నారు. వారు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అన్నారు. ఈ రాష్ట్ర యువరాజు, కాంగ్రెస్ యువరాజు భాషను మరోసారి గుర్తు చేసుకోవాలన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో 'పవిత్ర సెంగోల్' ప్రతిష్టాపనతో పాటు రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఈ రెండు పార్టీలు బహిష్కరించారు," అని మోదీ అన్నారు.
ఇండి కూటమి ప్రజలు, మహిళలపై "అసభ్యంగా ప్రవర్తిస్తారు". దివంగత "అమ్మ జయలలిత" బతికి ఉన్నప్పుడు డిఎంకె ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలుసు. "బిజెపి, ఎన్‌డిఎకు మీ ఆశీర్వాదాలు సనాతన, ధర్మాన్ని శక్తిని కాపాడతాయి. మహిళల గౌరవాన్ని నిర్ధారిస్తాయి" అని ప్రధాని అన్నారు.
Read More
Next Story