పెళ్లి కొడుకు కన్నుమూతతో కన్నీటి మడుగైన కళ్యాణ మండపం
x

పెళ్లి కొడుకు కన్నుమూతతో కన్నీటి మడుగైన కళ్యాణ మండపం

అతనో మంచి సైక్లిస్ట్ కూడా.. కానీ తాళికడుతుండగానే కుప్పకూలి పోయాడు


జీవితంలో ఇంత కన్నా విషాదం ఏముంటుందీ.. ఇంతలోనే ఇంత పెను విషాదమా.. జీవిత ఆనుపానాలు ఏమీ అనుభవించకుండానే ఇంతటి దారుణమా..
పెళ్లికొడుకు తాళి కట్టాడు. మూడు ముళ్లు వేసాడు. నవవధువు కన్నులల్లో సంతోషం మెరిసింది. పక్కనే వున్న వాళ్లంతా ఆనందాశ్రువులతో నెమ్మదిగా మంగళగానాలు ఆలపించడం మొదలుపెట్టారు. అదే వేళలో ఒక్కసారిగా ఓ గుండె కొట్టుకున్నట్లైంది.. తాళి కట్టిన పది నిమిషాలకే పెళ్లికొడుకు కూలిపోవడం ఎవ్వరూ ఊహించలేదు. కర్నాటక జామ్‌ఖండిలోని నందికేశ్వర కళ్యాణ మండపంలో సంతోషాన్ని మంటగలిపిన ఈ సంఘటన, క్షణాల్లో జీవితాన్ని శ్మశానంగా మార్చింది.
కర్నాటక బాగల్ కోట జిల్లా జామ్ ఖండి పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కుమహరహళ్లీ గ్రామానికి చెందిన శ్రీషా కుమారుడు ప్రవీణ్.. వయసు 25, మంచి సైక్లిస్ట్.. స్థానిక సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి కూడా. ఆయన తన మేనమామ కూతురిని వివాహం చేసుకుంటున్నాడు. ఇన్నాళ్లు కలలుకన్న జీవితం మొదలవుతుందని ఉత్సాహంతో వధూవరులు రెండుగుండెలూ ఒక్కటయ్యే క్షణాన్ని ఎదురుచూశారు. ఆ క్షణం వచ్చింది.. కానీ వెంటనే మరణమై మిగిలింది. ప్రవీణ్ మరణాన్ని స్పష్టంచేసిన డాక్టర్ల మాటలు వధువు గుండెని తునాతునకలు చేశాయి. వేదికపైనే వరుడి శవం.. పక్కనే వధువు విలపిస్తున్న దృశ్యాలు... పాఠాల్లేని విషాదగీతంలా మారాయి.
ప్రేమలో, బంధంలో, కలల్లో మునిగిన ఓ వధువు.. మూడో ముళ్లు వేసిన దాన్నే చివరి ఆశగా నమ్ముకుంది. కానీ మృత్యువు ముందు ఏ ఆశలకీ శక్తి ఉండదని ఇది మరోసారి గుర్తుచేసింది. కల్యాణ మండపం.. మంగళవాయిద్యాలు.. పుప్ప గుచ్ఛాలు.. అన్నీ ఒక్కసారిగా మౌనంగా రోదించాయి.

ఈ సంఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఒక క్షణంలో జీవితం తలకిందులవవచ్చు అనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రేమగా బతికే కంటే.. ప్రేమగా విడిపోవడం ఎంత కఠినమో ఈ కథ చెబుతుంది. ఆ నవ వధువు కన్నీర్లో బంధాలు మునిగిపోతుంటే, మనసు వేదనతో గుండె నిండిపోతుంది.
మృత్యువు రూపంలో కలలు గన్న జీవితం ఆవిరి అయిపోయింది. ప్రవీణ్ కుటుంబసభ్యులు అతడి శవం దగ్గర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More
Next Story