
రూ. వెయ్యి కోట్ల మద్యం కుంభకోణంపై మంత్రి సెంథిల్ బాలాజీ ఏమన్నారంటే..
‘‘టెండర్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఉద్యోగుల బదిల్లీలోనూ పూర్తి పారదర్శకత ఉంటుంది. ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం’’ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ
తస్మాక్(Tasmac)పై వస్తున్న ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మంత్రి సెంటిల్ బాలాజీ(V Senthil Balaji) స్పందించారు. రూ. వెయ్యి కోట్ల అవినీతి జరిగినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
లిక్కర్ టెండర్ల ప్రక్రియ నిబంధనలకు లోబడి, పూర్తి పారదర్శకతతో జరుగుతుందన్నారు. సెంటిల్ బాలాజీ చెప్పారు. గత నాలుగేళ్లుగా టెండర్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుందని, అందువల్ల అవినీతికి ఆస్కారం లేదన్నారు.
“మా సంస్థలో 2,500 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 10-20 మంది చిన్నపాటి నేరాలకు పాల్పడ్డవారున్నారు. వారిపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశాం. వారు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ముడిపెట్టడం తగదు” అని అన్నారు.
ఈ ఆరోపణలు ED విచారణకు ముందే వచ్చాయని, అయితే వాటికి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ఉద్యోగుల బదిలీలపై ఏమన్నారంటే..
తస్మాక్ ఉద్యోగుల బదిలీలు అవసరం మేరకు చేస్తామని మంత్రి చెప్పారు. అవి కూడా పారదర్శకంగా జరుగుతాయని, వాటిని అవినీతితో ముడిపెట్టడం సరికాదన్నారు బాలాజీ.
అసలు తస్తాక్‌లో ఏం జరిగింది?
తమిళనాడులో ప్రైవేటు డిస్ట్రిల్లరీల ద్వారా భారీ మొత్తంలో నల్లధనం చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Tasmac) అధికారులపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) FIR నమోదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది. మణి ల్యాండరింగ్ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మార్చి 7 నుంచి చెన్నై CMDA టవర్లలోని తస్మాక్ ప్రధాన కార్యాలయం సహా ఐదు ప్రైవేట్ డిస్టిలరీల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దొరికన పత్రాల ఆధారంగా రూ.వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.
"ప్రైవేట్ డిస్టిలరీలు నల్లధనం కేంద్రలుగా మారాయి. ఈ అక్రమ లావాదేవీల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది’’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి ఒకరు తెలిపారు. ఈ కుంభకోణంలో తస్మాక్ అధికారులకు పాత్ర కొంతేనని, రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని ఈడీ అనుమానిస్తోంది. తాస్మాక్ ద్వారా ఏటా రూ.30వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా.. దీని నిర్వహణపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తస్మిక్ ఎక్సైజ్ శాఖ పరిధిలో పనిచేస్తుండగా ఆ శాఖకు వి. సెంథిల్ బాలాజీ మంత్రిగా ఉన్నారు.